బావ‌ను డామినేట్ చేసాడుగా..!

 NPS
ఇండ‌స్ట్రీలో ఇప్పుడు మెగా బావా బామ్మ‌ర్దుల పోరు బాగా న‌డుస్తుంది. మొన్న‌టి వ‌ర‌కు సాయిధ‌రంతేజ్, వ‌రుణ్ తేజ్ మ‌ధ్య పోరు న‌డిచింది. అందులో వ‌రుణ్ తేజ్ క్లియ‌ర్ క‌ట్ గా గెలిచేసాడు. తొలిప్రేమ ఇప్పుడు క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తుంది. వీళ్లు జూనియ‌ర్లు అయితే.. ఇప్పుడు సీనియ‌ర్ల పోరు మొద‌లైపోయింది. రామ్ చ‌ర‌ణ్, బ‌న్నీ మ‌ధ్య ఇప్పుడు అస‌లు పోరు. వీళ్ల సినిమాల మ‌ధ్య కాదు.. పాట‌ల మ‌ధ్యే. ప్ర‌స్తుతానికి నా పేరు సూర్య‌లోని డ్యూయెట్.. రంగ‌స్థ‌లంలోని డ్యూయెట్ కు మ‌ధ్య‌లో పోటీ జ‌రుగుతుంది. ఎంత స‌క్క‌గున్నావే అంటూ మ‌న‌సులోని రామ‌ల‌క్ష్మిని త‌లుచుకుంటూ అచ్చ తెలుగు పాట‌ను మ‌న‌కు ఇచ్చారు సుకుమార్.. దేవీ శ్రీ ప్ర‌సాద్. దీనికి అంత‌కంటే అంద‌మైన లిరిక్స్ రాసాడు చంద్ర‌బోస్. ఈ పాట ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగానే హ‌డావిడి చేస్తుంది. ఇక ఈ పాట విడుద‌లైన 12 గంట‌ల‌కు నా పేరు సూర్య‌లోని ల‌వ‌ర్ ఆల్సో.. ఫైట‌ర్ ఆల్సో పాట విడుద‌లైంది. విశాల్ శేఖ‌ర్ సంగీతం అందించిన ఈ పాట రంగ‌స్థ‌లంతో పోలిస్తే కాస్త త‌క్కువ‌గానే పేలింది. దానికి కార‌ణం నేటివిటి లోపం కావ‌చ్చు. ఎందుకంటే విశాల్ శేఖ‌ర్ తెలుగు వాళ్లు కాదు.. ఎక్క‌డో నార్త్ నుంచి వ‌చ్చారు. బీట్ బాగానే ఉంది కానీ రంగ‌స్థ‌లంలోని వ‌యోలిన్ ముందు.. దేవీ ట్యూన్ ముందు బ‌న్నీ త‌ల వంచ‌క త‌ప్ప‌లేదు. ఇప్ప‌టికైతే రంగ‌స్థ‌లమా.. నా పేరు సూర్య‌నా అంటే మాత్రం నూటికి 80 మంది చెప్పే మాట అయితే క‌చ్చితంగా రంగ‌స్థ‌ల‌మే. మార్చ్ 30న రంగ‌స్థ‌లం విడుద‌ల కానుంది. ఎప్రిల్ 26న బ‌న్నీ సినిమా విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here