అక్కడ చనిపోయింది మామూలు వ్యక్తి కాదు.. ఇండియన్ సినిమాను 50 ఏళ్ల పాటు ఏలేసిన ఓ అందాల రాణి.. ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉన్న ఓ లెజెండ్. అలాంటి వ్యక్తి చనిపోతే కూడా దుబాయ్ రూల్స్ ఇంత కఠినంగా ఉంటాయని ఎవరూ ఊహించలేదు. శ్రీదేవి చనిపోయి అప్పుడే 40 గంటలు గడిచిపోయింది. కానీ ఇప్పటి వరకు ఆమె భౌతికకాయం ఇండియాకు రాలేదు. ఇప్పుడు అప్పుడు అంటున్నారు కానీ ఎప్పుడు వస్తుందనే విషయంపై క్లారిటీ రాలేదు. అయితే దుబాయ్ న్యూస్ పేపర్స్ చెబుతున్న దాని ప్రకారం ఇప్పటికే శ్రీదేవి భౌతికకాయానికి చేయాల్సిన ఫార్మాలాటిస్ అన్నీ పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ మార్టం పూర్తయింది.
దానికితోడు బాడీకి వాసన రాకుండా ఎంబాల్మింగ్ చేస్తున్నారు. దానికి మరో గంటన్నర టైమ్ పడుతుంది. ఇవన్నీ పూర్తయ్యే సరికి ఫిబ్రవరి 26 మధ్యాహ్నం 2 అవుతుంది. బాడీ ముంబైకు చేరుకునే సరికి సాయంత్రం 4 నుంచి 5 అవుతుంది. శ్రీదేవి కోసం ప్రత్యేకంగా తన ప్రైవేట్ ఫ్లైట్ ను దుబాయ్ పంపించాడు అనిల్ అంబాని. దుబాయ్ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. శ్రీదేవి అక్కడ చనిపోయింది కాబట్టి పోలీసుల ఇన్వాల్వ్ మెంట్ కూడా చాలా ఉంటుంది. ఓ మనిషి పక్క దేశంలో చనిపోతే ముందు ఆమె పాస్ట్ పోర్ట్ సీజ్ చేయాలి. ఇండియన్ గవర్నమెంట్ కూడా పాస్ట్ పోర్ట్ క్యాన్సిల్ చేసినట్లుగా సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి. ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడి పోలీస్ డిపార్ట్ మెంట్ డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తుంది.
ఒక్కసారి పోలీసుల నుంచి డెత్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కానీ శ్రీదేవి బాడీ ముంబైకు రాదు. దీనికోసం కచ్చితంగా మరో మూడు నాలుగు గంటలు వేచి చూడక తప్పదు. మరోవైపు ముంబైలోని ఆమె ఇంటి దగ్గర అభిమానులు గత 24 గంటల నుంచి పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోయిన్ వస్తుందా.. ఆమెను కడసారి చూద్దామా అని వాళ్లు కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు. ముందు ఫిబ్రవరి 26నే ఆమె అంత్యక్రియలు చేయాలని భావించినా.. ఇప్పుడు ఒకరోజు ఆలస్యంగా ఫిబ్రవరి 27నే అంత్యక్రియలు జరపనున్నారు. జుహూలోని శాంతక్రాజ్ స్మశాన వాటికలో ఈ కార్యక్రమం జరగనుంది.