జనసేన పార్టీకి ఏపీలో మంచి పట్టుంది. ఎందుకంటే అక్కడే పవన్ కళ్యాణ్ ఉంటాడు కాబట్టి.. పైగా ఇప్పుడు అక్కడ రాజకీయ ప్రత్యాన్యాయం కోసం ప్రజలు కూడా చూస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఆయన మాటల్ని బట్టి చూస్తుంటే పవన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాస్తో కూస్తో నమ్మేలా ఉన్నారు. కానీ ఈయన పార్టీకి తెలంగాణలో మాత్రం ఏ అండ కనిపించట్లేదు. ఇప్పుడు తెలంగాణలో తన పార్టీని నడిపించడానికి ఎవరో ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలి. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో పవన్ అయితే రాజకీయాలు చూసుకోలేడు. అందుకే ఇప్పుడు తెలంగాణలోనూ జనసేనకు ఓ సినిమా ఇమేజ్ ఉన్న లీడర్ కోసమే చూస్తున్నాడు పవర్ స్టార్. ఈయనకు బయటే కాదు.. ఇండస్ట్రీలో కూడా వీరాభిమానులు ఉన్నారు. కాదు కాదు.. భక్తులు ఉన్నారు. వాళ్లు పవన్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధం.
ఆయనతో పాటు నడిచి.. రాజకీయ ప్రచారం చేయలేరేమో గానీ పవన్ కోసం తమకి తోచిన సాయం చేయడానికి మాత్రం ముందే ఉంటారు. జనసేన పార్టీ స్థాపించి 2019 ఎన్నికలకు సిద్ధమవుతున్నాడు పవర్ స్టార్. చూస్తుంటే ఏడాది ముందే ఎన్నికలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపిలో తాను పోటీ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేసాడు పవన్. కానీ తెలంగాణలో మాత్రం పవన్ పార్టీ ఊసే లేదు. ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేయడం కోసం ఓ కుర్ర హీరోను తెరపైకి తీసుకొస్తున్నాడు పవర్ స్టార్. తన వీరాభిమాని.. భక్తుడు అయిన నితిన్ ను తెలంగాణ జనసేనానిగా నియమించే యోచనలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. నితిన్ కు పెద్దగా ఫాలోయింగ్ లేకపోవచ్చేమో గానీ.. తెలంగాణ హీరో అనే ముద్రతో పాటు పవన్ అభిమానుల అండ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది చాలు తెలంగాణలో జనసేన కాస్తైనా ప్రభావం చూపించడానికి అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. చూడాలిక.. 2019లో నితిన్ తో కలిసి పవన్ ఏం మాయ చేస్తాడో..?