కుటుంబం.. అన్న‌గారి కుటుంబం.. 

అన్న‌గారి కుటుంబం అంటే ముందుగా గుర్తొచ్చేది నంద‌మూరి కుటుంబ‌మే. ఎన్టీఆర్.. ఆయ‌న త‌న‌యులు.. త‌న‌య‌లు.. మ‌న‌వ‌లు.. ఇలా ఎంతో మంది ఉంటారు ఆ కుటుంబంలో. కానీ ప్ర‌జ‌ల్లో మాత్రం రిజిష్టర్ అయింది రెండు కుటుంబాలే. అదే హ‌రికృష్ణ‌.. బాల‌య్య కుటుంబాలు. ఈ ఇద్ద‌రూ సినిమాల‌తో పాటు రాజ‌కీయాల్లోనూ బాగా ఫేమ‌స్. అందుకే ఎన్టీఆర్ కుటుంబం అన‌గానే ముందుగా వీళ్లే గుర్తొస్తారు. మొద‌ట్లో బాగానే క‌లిసున్న ఈ ఫ్యామిలీస్ ఇప్పుడు విడివిడిగా ఉన్నాయి. కొన్నేళ్లుగా ఎమైందో తెలియ‌దు కానీ హ‌రికృష్ణ కుటుంబాన్ని పూర్తిగా దూరం పెట్టాడు బాల‌కృష్ణ‌. ఈ విష‌యంలో చంద్ర‌బాబు కుట్ర కూడా ఉందంటారు కొంద‌రు. అయినా కానీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా స‌క్సెస్ కావ‌డంతో ఇప్ప‌టికీ హ‌రికృష్ణ త‌న ఉనికి చాటుకుంటున్నాడు. ఇది చూసి అప్ప‌ట్లో చంద్ర‌బాబు మ‌ళ్లీ హ‌రికృష్ణ కుటుంబాన్ని క‌లుపుకున్నారు. ప‌నికొస్తాడేమో అని జూ. ఎన్టీఆర్ కు త‌న మేన‌కోడ‌లి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసాడు. కానీ త‌ర్వాత మ‌ళ్లీ చెడింది.
కొన్నేళ్ల నుంచి దూరంగానే ఉంటున్నాయి ఈ రెండు కుటుంబాలు. ఇదంతా జ‌రుగుతుంటే.. ఇప్పుడు ఓ విచిత్రం జ‌రిగింది.. పైన ఉన్న అన్న‌గారే త‌న కుటుంబాన్ని క‌లిపేసారు. కొన్నేళ్లుగా నంద‌మూరి ఫ్యామిలీలో  వివాదాలు న‌డుస్తున్నాయ‌ని ఎవ‌ర్నీ అడిగినా చెబుతారు. కానీ ఇప్పుడు అవ‌న్నీ మ‌రిచిపోయి త‌న సినిమా ఓపెనింగ్ కి హ‌రికృష్ణ కుటుంబాన్ని  పిలిచాడు బాల‌య్య‌. త‌న సినిమా అనేకంటే మ‌న సినిమా అనాలేమో నంద‌మూరి కుటుంబం. ఎందుకంటే అక్క‌డ జ‌రుగుతున్న‌ది ఎన్టీఆర్ బ‌యోపిక్ క‌దా.
అందుకే ఈ చిత్ర ఓపెనింగ్ కు కుటుంబాన్ని పిలిచాడు బాల‌య్య‌. త‌మ మ‌ధ్య దూరం ఎంత ఉన్నా పెద్దాయ‌న సినిమా విష‌యానికి వ‌చ్చేస‌రికి మాత్రం అంతా ఒక్క‌టే అని నిరూపించాడు బాల‌య్య‌. రామ‌కృష్ణ స్టూడియోస్ లో ఇండ‌స్ట్రీలో ఉన్న అగ్ర ద‌ర్శ‌కులు.. టాప్ టెక్నీషియ‌న్స్ అంతా ఈ ఓపెనింగ్ కు వ‌చ్చారు. మొత్తానికి పెద్దాయ‌న పుణ్య‌మా అని కుటుంబం ఒక్క‌టైతే చాలంటున్నారు అభిమానులు కూడా. మార్చ్ 29 ఉద‌యం 9.42 నిమిషాల‌కు ఈ ఓపెనింగ్ జ‌రిగింది. బాల‌య్య ధుర్యోధ నుడిగా వ‌చ్చి అభిమానుల‌ను అల‌రించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here