సిట్టిబాబు దూకుడు రోజురోజుకీ అలాగే ఉంది కానీ తగ్గడం లేదు. చాలా సినిమాలు వీకెండ్స్ లో కుమ్మేసి.. వీక్ డేస్ రాగానే బాగా వీక్ అవుతాయి. కానీ రంసగ్థలం మాత్రం ఇప్పటికీ అలాగే కుమ్మేస్తుంది. విడుదలైన ఆరో రోజు కూడా 4.50 కోట్ల షేర్ తెలుగు రాష్ట్రాల్లో తీసుకొచ్చిందంటే ఈ చిత్రం దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు ప్రేక్షకులు ఎంతగా బ్రహ్మరథం పడుతున్నారో తెలిసిపోతుంది. బాహుబలితో పాటు ఖైదీ నెం.150ని మాత్రమే వదిలేసి.. మిగిలిన అన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు సిట్టిబాబు. ఈ చిత్రం ఆరు రోజుల్లోనే 75 కోట్ల షేర్ మార్క్ అందుకుంది. ఈ వారం ఛలో మోహన్ రంగా వచ్చినా కూడా రంగస్థలం మాత్రం దూకుడు తగ్గించేలా కనిపించట్లేదు. రెండో వీకెండ్ కూడా ఈజీగా మరో 15 కోట్ల వరకు లాగేలా కనిపిస్తుంది. మొత్తానికి ఈ చిత్రం జర్నీ 100 కోట్ల వైపు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికీ చాలా చోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. రోజుకు కనీసం 5 కోట్ల షేర్ వస్తుంది. ఈ దూకుడు చూస్తుంటే నితిన్ కూడా సిట్టిబాబుకు బ్రేకులు వేయడం కష్టమే. నీ దారి నీదే.. నా దారి నాదే అన్నట్లుగా ఉంది ఇప్పుడు రంగస్ధలం ప్రయాణం. ఇప్పటికి ఖైదీని కదిలించలేదు కానీ ఫుల్ రన్ లో మాత్రం చిరంజీవిని టార్గెట్ చేసాడు రామ్ చరణ్. మరి చూడాలిక.. ఏం జరుగుతుందో..?