ఈ రోజుల్లో పెద్ద సినిమాల విడుదల అవుతుందంటే తొలిరోజు వసూళ్లెంత అని అడగడం లేదు.. ఎన్ని రికార్డులకు చెక్ పడింది అంటున్నారు. రంగస్థలం.. భరత్ అనే నేను కూడా ఓపెనింగ్స్ లో కొత్త రికార్డులు సృష్టించాయి. కానీ ఇప్పుడు అల్లుఅర్జున్ మాత్రం అదేం చేయలేకపోయాడు. ఈయన నా పేరు సూర్య యావరేజ్ టాక్ తోనే మొదలైంది. దాంతో సినిమాకు కూడా ఊహించిన రేంజ్ లో రికార్డులేవీ రాలేదు. కానీ మంచి వసూళ్లే వచ్చాయి. తొలిరోజు ఈ చిత్రం 20 కోట్ల షేర్ తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల 20 లక్షలు షేర్.. 23 కోట్ల గ్రాస్ వసూలు చేసింది సూర్య. ఇక ఓవర్సీస్ తో పాటు కర్ణాటక, తమిళనాడు కలిసి మరో 4 కోట్లకు పైగానే షేర్ వచ్చింది. డిజేతో పోలిస్తే ఇది తక్కువ వసూళ్లే. బన్నీ కెరీర్ లో రెండో హైయ్యస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది నా పేరు సూర్య. ఈ చిత్రం టాక్ తో పోలిస్తే తొలి మూడు రోజులు ఓపెనింగ్స్ అయితే పర్లేదు కానీ ఆ తర్వాత నిలబడుతుందా అనేది ఆసక్తకరంగా మారింది. ఈ చిత్రం సేఫ్ కావాలంటే అక్షరాలా 83 కోట్లు వసూలు చేయాలి. చూడాలిక.. సూర్య ఈ టాక్ తో ఏం చేస్తాడో.. ఎంత దూరం వెళ్తాడో..?