కళ్యాణ్ దేవ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో బాగానే వినిపిస్తుంది ఈ పేరు. కారణం మెగా ఫ్యామిలీ నుంచి రావడమే. మిగిలిన హీరోలకు ఉన్నంత ప్లాట్ ఫామ్ ఈయనకు దొరకలేదు కానీ ఉన్నంతలో భారీగానే వస్తున్నాడు కళ్యాణ్. యాక్టింగ్ బ్యాగ్రౌండ్ లేకపోయినా కూడా చిరు అల్లుడు అనే ట్యాగ్ లైన్ ఈ హీరోకు పనికొస్తుంది. పైగా స్క్రీన్ ప్రజెన్స్ అయితే బాగానే ఉంది కానీ నటన ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.
ట్రైలర్ లో తండ్రీ కొడుకుల మధ్య రిలేషన్ బాగా హైలైట్ చేసాడు దర్శకుడు రాకేష్ శశి. జతకలిసే తర్వాత ఈయన చేసిన సినిమా ఇది. సాయి కొర్రపాటి నిర్మి స్తున్న ఈ చిత్రంలో మాళవిక నయ్యర్ హీరోయిన్. తండ్రి చాటు బిడ్డగా ఇందులో నటిస్తున్నాడు కళ్యాణ్ దేవ్. అన్నీ తండ్రే చూసుకోవాలి.. తాను మాత్రం ఖాళీగా ఉంటాను అనే పాత్ర ఇది. ఆ తర్వాత లైఫ్ లో అనుకోకుండా ఓ కష్టం వచ్చినపుడు ఆ కొడుకు ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది విజేత కథ. ట్రైలర్ లోనే దాదాపు కథ ఇలా ఉండబోతుందని చెప్పేసాడు దర్శకుడు రాకేష్.
ఇక కళ్యాణ్ కూడా చూడ్డానికి బాగున్నాడు. అతడి తండ్రిగా మురళీ శర్మ నటించాడు. ఎక్కడా మామయ్యను కానీ.. మెగాస్టార్ గుర్తులు కానీ ఎక్కడా అయితే కనిపించలేదు. మరి రేపు సినిమాలో కూడా ఏం లేకపోతే అల్లుడు సొంతంగా ఏదో చేస్తున్నాడని అర్థం. జులై 12న దాదాపు 400 థియేటర్స్ లో విడుదల కానుంది విజేత. మొత్తానికి చూడాలిక.. జులైలో ఈ అల్లుడుగారి గిల్లుడు ఎలా ఉంటుందో తెలుస్తుంది.