ప్రభుదేవా ప్రధాన పాత్రలో పెన్ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిలింస్ సమర్పణలో.. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో కార్తీకేయన్ సంతానం, జయంతి లాల్ నిర్మించిన సైలెంట్ చిత్రం ‘మెర్కురి’. ఈ సినిమా ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. తెలుగులో కె.ఎఫ్.సి. ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ సినిమాను విడుదల చేస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది.
ప్రభుదేవా, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తో పాటు ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ షో కి ప్రత్యేక అతిథిగా విచ్చేసారు.
అర్జున్ రెడ్డితో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఫార్ములాలను, ఫార్మాట్ లను పట్టించుకోకుండా నమ్మిన కథను గట్స్ తో తెరకెక్కించి ట్రెండ్ ని సెట్ చేసిన ఈ దర్శకుడు ‘మెర్క్యురి’ ని చూసి థ్రిల్ అయ్యాడు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ…
‘ ఈ మద్యకాలంలో ఇలాంటి తీక్షణమైన థ్రిల్లర్ సినిమాని చూడలేదు. ప్రభుదేవా నటన చాలా గొప్పగా ఉంది. సంతోష్ నారాయణ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం, సినిమా ని ఉత్కంఠంగా చూసాను. ఆర్ట్ వర్క్ సైకలాజికల్ థ్రిలర్స్ ని రూపొందించే హాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ఫిన్చర్ సినిమాలను గుర్తుకు తెచ్చింది. ఇంత లోతైన థ్రిల్లర్ ఫిల్మ్ ని నేను చూడలేదు.. మెర్క్యురి ఒక మెమరబుల్ ఎక్స్ పీరియన్స్ ని అందించింది.