అనసూయ తొలి రెమ్యునరేషన్ మరీ అంత తక్కువా..

జీవితంలో ఎదిగిన తర్వాత అన్ని గొప్పగా అనిపిస్తాయి. కాని ఎదగకముందు గతం మాత్రం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. ప్రస్తుతాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుని గాతాన్ని వదిలేస్తే అంత కంటే దారుణం ఇంకోటి ఉండదు. ఇప్పుడు అనసూయ కూడా తన గతాన్ని గుర్తు పెట్టుకొని వివరాలన్నీ చెబుతోంది. ఈ భామ పేరు ప్రస్తుతం తెలియని వారు ఉండరు. అటు నటన ఇటు యాంకరింగ్ రెండింట్లోనూ సత్తా చూపిస్తుంది అనసూయ.

స్టార్ గా చక్రం తిప్పుతున్న లక్షలకు లక్షలు ఆలా సంపాదిస్తుంది అనసూయ. అలాంటి ముద్దుగుమ్మకు ఒకప్పుడు ఎంత పారితోషికం వచ్చేది తెలుసా.. అసలు ఈమె అందుకున్న తొలి రెమ్యునరేషన్ ఎంతో కనీసం ఐడియా అయినా ఉందా.. అభిమానులతో చాట్ చేసిన అనసూయ తన పాత రోజులని గుర్తు చేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పింది అనసూయ.

Anasuya Bharadwaj Shocking Remuneration
Anasuya Bharadwaj Shocking Remuneration

అప్పుడప్పుడో పదహారేళ్ళ కింద జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాగ సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది అనసూయ. ఐతే ఆ తర్వాత ఆమె టీవీ రంగానికి పరిచయం అయ్యే ముందు ఒక చానల్లో న్యూస్ యాంకర్ గా పనిచేసింది. అప్పుడు తన తొలి పారితోషికం 5500 అని చెప్పింది అనసూయ. మొదట్లో చాలా కష్టాలు పడిన ఈ భామ జబర్దస్త్ తో గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ ప్రోగ్రాం సక్సెస్ అయిన తరువాత అనసూయ కూడా స్టార్ అయిపోయింది. ఇంక తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఈ భామకు. ఇప్పుడు వరుస సినిమాలతో పాటు షోస్ కూడా చేసుకుంటూ కోట్లు సంపాదిస్తుంది అనసూయ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here