నటిగా బిజీ అవుతున్న యాంకర్ అనసూయ..

యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి జబర్దస్త్ ప్రోగ్రాంతో హోస్ట్ గా మారి ఇప్పుడు నటిగా బిజీ అవుతుంది యాంకర్ అనసూయ. రోజు రోజుకు తన క్రేజ్ పెంచుకుంటూ పోతుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్ళై ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా అదిరిపోయే గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది అను. ఇప్పుడు ఈ భామ కోసం దర్శక నిర్మాతలు కూడా ప్రత్యేకంగా పాత్రలు సృష్టిస్తున్నారు. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అదరకొట్టిన అనసూయ ఆ తర్వాత వరస సినిమాలు చేస్తూనే ఉంది.

ఈ మధ్యే విడుదలైన ఫ్2 సినిమాలో కూడా అతిధి పాత్రలో నటించింది. విడుదలకు సిద్ధంగా ఉన్న యాత్ర సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించింది అనసూయ. ఇక ఇప్పుడు మరో సినిమాలో నటించబోతుంది అనసూయ. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి చేస్తున్న సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటించబోతోంది. ఈ చిత్రంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు. కింగ్ ఆఫ్ హిల్స్ బ్యానర్పై ఈ చిత్రం రూపొందనుంది. దీనికి దర్శకుడు ఎవరనేది ఇంకా క్లారిటీ రాకపోయినా కూడా అనసూయతో పాటు తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్ర పోషించబోతున్నాడు అనేది మాత్రం తెలుస్తోంది. ఓవైపు నటుడిగా బిజీగా ఉంటూనే మరోవైపు వరసగా చిన్న సినిమాలు నిర్మించాలని నిర్ణయించుకున్నారు విజయ్ దేవరకొండ. అందులో భాగంగానే ఇప్పుడు అనసూయ, తరుణ్ భాస్కర్ తో ఈ సినిమా నిర్మించబోతున్నాడు ఈ కుర్ర హీరో. మొత్తానికి అనసూయ మాత్రం రోజు రోజుకు మరింత బిజీ అవుతూనే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here