యాత్ర సినిమాలో అనసూయ పాత్ర అదే..

వైయస్సార్ జీవితంపై ఇప్పుడు యాత్ర సినిమా వస్తున్న సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. ఫిబ్రవరి 8న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి చిత్రంలో వైయస్ రాజశేఖర రెడ్డి పాత్రలో నటిస్తుండడం అంచనాలు పెంచుతోంది. ఆనందోబ్రహ్మ సినిమాతో విజయం అందుకున్న మహీ రాఘవ దీనికి దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఇక ఈ సినిమాలో అనసూయ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఇందులో పోషిస్తున్న పాత్ర ఏంటో అని ఆసక్తి ఉండేది ప్రేక్షకుల్లో. చేవెల్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి పాత్రలో అనసూయ నటిస్తుందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ జర్నలిస్టుగా నటిస్తుందనే వార్తలు కూడా మరో సారి వచ్చాయి.

అయితే ఇప్పుడు ఈ రెండు కాదు అనసూయ ఇందులో ఒక ఎమ్మెల్యే పాత్రలో నటించబోతోంది. 2004 సమయంలో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన గౌరు చరితారెడ్డి అనే పాత్రలో అనసూయ నటించబోతోందని తెలుస్తోంది. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో గౌరు చరితారెడ్డి కి మంచి అనుబంధం ఉండేది. ఆమె ఏ విధంగా ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలోనే ఆమె పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో కచ్చితంగా అనసూయ పాత్ర బాగా వెళుతుందని నమ్మకం గా కనిపిస్తున్నాడు దర్శకుడు మహి. మొత్తానికి ఫిబ్రవరి 8న రానున్న యాత్ర సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here