బాలకృష్ణను నాగబాబు వదలడం లేదు.. అదే సమయంలో మెగా హీరోలను బాలకృష్ణ వదలడం లేదు.. అర్థం కాలేదు కదా అక్కడ నాగబాబు వివాదాల చుట్టూ తిరుగుతుంటే ఇక్కడ బాలయ్య సినిమాల చుట్టూ తిరుగుతున్నాడు. ప్రతి సంక్రాంతికి తన సినిమాను తీసుకురావడం.. అదే పండక్కి ఎవరో ఒక మెగా హీరోతో పోటీ పడటం అలవాటుగా మార్చుకున్నాడు నందమూరి హీరో. 2017లో ఖైదీ నెంబర్150 సినిమాతో గౌతమీపుత్ర శాతకర్ణి తీసుకొచ్చాడు బాలకృష్ణ. ఆ మరుసటి ఏడాది పండక్కి అజ్ఞాతవాసిగా పవన్ కళ్యాణ్ వస్తే జై సింహ అంటూ బాలకృష్ణ వచ్చాడు. ఇక ఈ ఏడాది ఇద్దరు మెగా అబ్బాయిలతో పోటీ పడుతున్నాడు బాలకృష్ణ. రామ్ చరణ్ వినయ విధేయ రామ.. వరుణ్ తేజ్ ఎఫ్2 సినిమాలు వస్తుంటే కథానాయకుడుగా బాలకృష్ణ రానున్నాడు.
2017లో చిరంజీవితో పాటు విజయం అందుకున్నాడు బాలకృష్ణ.. కానీ 2018 లో మాత్రం పవన్ ను ఓడించాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన అజ్ఞాతవాసి డిజాస్టర్ కావడంతో బాలయ్యకు బాగా కలిసి వచ్చింది. రొటీన్ సినిమానే అయినా కూడా జై సింహ కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ఇక ఈ ఏడాది బాలయ్య ఏం చేస్తాడో అని అంచనాలు అభిమానుల్లో ఉన్నాయి. మెగా కుర్రాళ్ళతో బాలయ్య పోటీపడతాడా.. మరోసారి హిట్ కొడతాడా అంటూ పందాలు వేసుకుంటున్నారు ప్రేక్షకులు. ఈ పండక్కి బాలయ్య హిట్ కొడితే హ్యాట్రిక్ పూర్తయినట్టే. గౌతమీపుత్ర శాతకర్ణి.. జై సింహా సినిమాల తర్వాత వరసగా మూడో ఏడాది పండక్కి వస్తున్నాడు బాలయ్య.