జీవితంలో అవకాశం అనేది ఒక్కసారే వస్తుంది. అది వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కే జి ఎఫ్ టీం కూడా ఇదే చేస్తుంది. ఈ చిత్రం ఈ స్థాయి విజయం సాధిస్తుందని వాళ్లకు కూడా తెలియదేమో. ఎందుకంటే తొలిభాగం సృష్టించిన సంచలనాలు చూస్తుంటే ఆశ్చర్యపోవడం తప్ప ఇంకేం లేదు.
ఈ సినిమా ఇప్పటికే వారం రోజుల్లోనే 150 కోట్ల గ్రాస్ వసూలు చేసి 200 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. ఇలాంటి సమయంలో కే జి ఎఫ్ చాప్టర్ 2 కోసం కోసం అని ఇండస్ట్రీలలో నుంచి భారీ పోటీ ఉంది. దాంతో బిజినెస్ విషయంలో ఈ చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. పార్ట్ 2 బిజినెస్ ఇప్పుడే పూర్తి చేయకూడదని వాళ్లు ఫిక్స్ అయిపోయారు. నెమ్మదిగా సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత గానీ అసలు బిజినెస్ మొదలుపెట్టాలి అని ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. దానికి కారణం కూడా లేకపోలేదు.
అప్పటివరకు ట్రైలర్స్, టీజర్స్ విడుదలైన తర్వాత ఇంకా ఎక్కువ బిజినెస్ జరుగుతుంది అని వాళ్ళ అంచనా. అందుకే ఇప్పుడే సినిమా అమ్మకూడదు అని వాళ్లు మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. పైగా చాప్టర్ వన్ సృష్టించిన సంచలనాలు చూసి చాప్టర్ 2 కోసం మూడింతలు రెట్లు ఎక్కువగా ఇస్తామంటూ వస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు.
కానీ వాళ్లు మాత్రం అస్సలు టెంమ్ట్ కావడం లేదు. సినిమా పూర్తయిన తర్వాత అమ్మకూడదు అని నిర్ణయం తీసుకుంటున్నారు. అంతేకదా మరి.. బంగారు కోడిపెట్ట చేతిలో ఉన్నప్పుడే దాని గుడ్లను వాడుకోవాలి.. గుడ్లు తినేది ఎవరో అయితే వీళ్లెందుకు కష్టపడటం..? ప‌్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో యశ్ హీరోగా నటించాడు. బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది.