కాజ‌ల్ ను అవ‌మానించిన జెట్ ఎయిర్ వేస్..

సెలబ్రిటీలు కూడా కూడా మనుషులే.. వాళ్లకు కూడా అప్పుడప్పుడు కష్టాలు ఎదురవుతాయి. ఇంకా చెప్పాలంటే మిగిలిన వాళ్ళ కంటే వాళ్ళ కష్టాలు ఇంకా దారుణంగా ఉంటాయి. మనకు ఎదురైతే కష్టం.. కానీ వాళ్లకు ఎదురైతే అది అవమానం. ఎందుకంటే వాళ్లకి ఏదైనా జరిగితే అందరూ దాన్ని హైలెట్ చేస్తారు. ఇప్పుడు కాజల్ కు కూడా ఇదే జరిగింది. ఈమెకు జెట్ ఎయిర్వేస్ లో అవమానం జ‌రిగింది. అక్కడ ఊహించ‌ని పరిస్థితులతో షాక్ అవ్వడం కాజల్ వంతు అయింది. ఈ భామ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. అందులో భాగంగానే ఒక దేశం నుంచి మరో దేశానికి షూటింగ్ కోసం వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అదే చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఎయిర్వేస్ విమానం లో మరో దేశానికి వెళ్లడానికి ఎయిర్ పోర్ట్ కు వెళ్లింది కాజ‌ల్. అక్కడ చెప్పిన సమయం కంటే 70 నిమిషాల ముందే లోపలికి వెళ్ళింది. కానీ వెళ్లిన తర్వాత కూడా అధికారులు ఈమెను వెయిట్ చేయించారు.

Kajal Aggarwal Spicy Stills

ఈమెతో పాటు మరింత మంది ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు.. కావాలనే విమానాన్ని తీసుకొచ్చి టెర్మినల్లో 30 నిమిషాల పాటు పార్క్ చేశారని చెబుతుంది కాజ‌ల్. టైమ్ అయిపోయినా కూడా కావాల‌నే ప్లెయిన్ మొదలు పెట్టలేదని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. తనతో పాటు ఇంకా చాలామంది ప్రయాణికులు కూడా ఎయిర్ వేస్ సిబ్బంది ప్రవర్తనతో చాలా ఇబ్బంది పడ్డారని గుర్తు చేసుకుంది చంద‌మామ‌. వాళ్లకు ప్రయాణికులు అంటే కనీస మర్యాద లేకపోవడం దారుణం అంటోంది కాజల్ అగర్వాల్. తమను లోపల కూర్చోబెట్టి గంటసపు విమానం డోర్ మూసి వేశారంటూ ఆరోపించింది కాజల్ అగర్వాల్. మొత్తానికి ఈ భామకు జరిగిన అవమానంతో చాలా ఫీల్ అయింది. ఇదే జెట్ ఎయిర్వేస్ పై గతంలో కూడా కొందరు సెలబ్రెటీలు కంప్లైంట్ చేశారు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here