ఇంత‌కీ తెలుగులో బిగ్ బాస్ 3 హోస్ట్ ఎవ‌రు..?

బిగ్ బాస్ అంటే ఒకప్పుడు ఉత్తరాది ప్రేక్షకులు మాత్రమే గుర్తొచ్చే వాళ్ళు.. కానీ ఇప్పుడు తెలుగులో కూడా ఈ షో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికే రెండు సీజన్లు తెలుగులో కూడా మంచి ఆదరణ పొందాయి. మన వాళ్లు కూడా బిగ్ బాస్ షో కు బాగానే అలవాటు పడ్డారు. ఇక్కడ వచ్చిన రేటింగ్ లే దీనికి నిదర్శనం. దానికితోడు స్టార్ హీరోలు హోస్టులుగా ఉండటంతో ప్రేక్షకులు కూడా బాగానే ఫిదా అయిపోయారు ఈ కార్యక్రమానికి. ఇప్పుడు మూడో సీజన్ కు కూడా రంగం సిద్ధం అవుతుంది. అయితే ఇప్పుడు నిర్వాహకులకు ఒక కష్టం వచ్చి పడింది. తొలి రెండు సీజన్లకు ఎలాగోలా స్టార్ హీరోల‌ను ఒప్పించి హోస్టింగ్ చేయించిన స్టార్ మా యాజమాన్యానికి.. మూడో సీజన్ కోసం ఎవరిని హోస్ట్ గా తీసుకురావాలి అనేది అర్థం కావ‌డం లేదు.

BiggBoss 3 Host A Big Dilemma
BiggBoss 3 Host A Big Dilemma

వాళ్లు ఈ విష‌యంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ తాను చేయలేనని చెప్పేసాడు.. రాజమౌళి సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఇప్పుడు జూనియర్ ఇటు వైపు కూడా చూడటం లేదు. మరోవైపు నాని కూడా అంతే బిజీగా ఉన్నాడు. దాంతో నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోల కోసం స్టార్ మా యాజమాన్యం ప్రయత్నించినా కూడా వాళ్ల నుంచి కూడా నో అనే సమాధానమే వచ్చిందని తెలుస్తోంది. దాంతో ఇప్పుడు స్టార్ హీరోలలో ఎవ‌ర్ని హోస్ట్ గా ఒప్పించాలా అనే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అయితే వాళ్లకు ఇలా సమాధానం దొరకడం లేదు, దాంతో బిగ్ బాస్ 2 హోస్ట్ ఎవరై ఉంటారనే ఆసక్తి ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ లోనూ బాగానే కనిపిస్తోంది. మరి దీనికి సమాధానం ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here