మ‌హేశ్ ల‌వ‌ర్ చాలా బిజీ అబ్బా..!

సిఎం ప్రియురాలు అంటే ఆ మాత్రం బిజీగా ఉండ‌దా..? ఇప్పుడు కైరా అద్వాని కూడా అంతే. ఈమె బిజీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిపోయింది. ఒక్క నిమిషం కూడా ఎక్క‌డా ఉండ‌టం లేదు. అటు ఇటు తిరుగుతూనే ఉంది. ముంబై టూ హైద‌రాబాద్ చ‌క్క‌ర్లు కొడుతూ హాయిగా కెరీర్ ను ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఓ వారం ముంబైలో ఉంటే.. మ‌రోవారం హైద‌రాబాద్ లో వ‌చ్చి వాలిపోతుంది. అక్క‌డ కూడా ఇప్పుడు ఓ సినిమాలో న‌టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.
క‌ర‌ణ్ జోహార్ సినిమాలో కైరాఅద్వాని హీరోయిన్ గా ఎంపికైంది. ఇదివ‌ర‌కే ఓ సినిమాలో చేయాల్సి ఉన్నా అప్పుడు మిస్సైన అవ‌కాశం ఇప్పుడు ఇచ్చాడు క‌ర‌ణ్. పైగా ఈ మ‌ధ్యే క‌ర‌ణ్ జోహార్ తెర‌కెక్కించిన లస్ట్ స్టోరీస్ లో ర‌చ్చ చేసింది కైరా. ఈ న‌ట‌న‌కు ఫిదా అయి పోయి వెంట‌నే మ‌రో ఆఫ‌ర్ ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. దానికితోడు తెలుగులో చ‌ర‌ణ్ సినిమాలో న‌టిస్తుంది కైరా. దాంతోపాటు మ‌రో సినిమాలోనూ ఈ భామ‌ను అనుకుంటున్నారు. దాంతో ముంబై టూ హైద్రాబాద్ తిరుగుతూనే ఉంది ఈ బ్యూటీ. కెరీర్ కోస‌మే క‌దా.. త‌ప్పులేదు త‌ప్ప‌లేదు అంటుంది ఈ ముద్దుగుమ్మ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here