విజ‌య్ దేవ‌ర‌కొండను తొక్కేస్తున్నారా..?

ఇండ‌స్ట్రీలో ఏ అండ లేకుండా ఎద‌గ‌డం చాలా క‌ష్టం. గ‌త ప‌దేళ్ల‌లో అలా ఏ అండ‌దండ‌లు లేకుండా స్టార్ అయింది ఒక్క నాని మాత్ర‌మే. సోలోగా ఒక్కో సినిమాతో మార్కెట్ పెంచుకుంటూ 40 కోట్ల హీరోగా మారాడు న్యాచుర‌ల్ స్టార్. ఇండ‌స్ట్రీలో గాడ్ ఫాద‌ర్ లేకుండా రావ‌డం అంటే సాహ‌స‌మే. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఏ అండ లేకుండానే స్టార్ అవుతున్నాడు.
Vijay Deverakonda
పెళ్లిచూపులుతో గుర్తింపు తెచ్చుకున్న విజ‌య్.. అర్జున్ రెడ్డితో అరాచ‌కం చేసాడు. ఈ సినిమాతో ఈయ‌న‌కు ప్ర‌త్యేకంగా అభిమాన సంఘాలు కూడా వ‌చ్చాయి. అయితే ఇప్పుడు ఈ హీరో ఎదుగుద‌ల చూసి కొంద‌రు కుట్ర చేస్తున్నార‌నే ప్ర‌చారం ఇండ‌స్ట్రీలో గ‌ట్టిగానే జ‌రుగుతుంది.
ఓ వ‌ర్గం కావాల‌నే విజ‌య్ ను టార్గెట్ చేస్తుంద‌ని.. అత‌న్ని తొక్కేయాల‌నే క‌సితో ఉన్నార‌ని తెలుస్తుంది. ఇప్పుడు గీత‌గోవిందం సీన్స్ లీక్ కావ‌డం కూడా ఇందులో భాగ‌మే అని వార్త‌లున్నాయి. దానికితోడు ట్యాక్సీ వాలా సినిమాను కూడా విడుద‌ల‌కు ముందే లీక్ చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. విజ‌య్ కూడా ఈ విష‌యంపై స్పందించాడు. త‌న‌ను ఎంత‌మంది తొక్కేయాల‌ని చూసినా ఇంకా ఎదుగుతూనే ఉంటాన‌ని చెప్పాడు. మొత్తానికి ఏ అండ‌దండ‌లు లేకుండా హీరోగా ఎదుగుతుంటే ఈ ఇండ‌స్ట్రీ ఓర్చుకోలేద‌నేది మాత్రం కాద‌న‌లేని నిజం. ఎక్క‌డ్నుంచో వ‌చ్చి ఇక్క‌డ జెండా పాతేస్తానంటే.. ఆల్రెడీ పాతిన పాత వాళ్ల‌కు కాలుతుంద‌ని మ‌రోసారి విజ‌య్ విష‌యంలో ప్రూవ్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here