60 కోట్ల వైపు ప‌రుగులు తీస్తున్న ఎఫ్2.. 

ఇది నిజంగానే అద్భుతం. అస‌లు ఎవ‌రూ ఊహించిన అద్భుతం. చిన్న సినిమా అనుకున్న‌ది కాస్తా ఇప్పుడు పెద్ద సినిమాల‌ను కూడా ప‌క్క‌న‌బెట్టేసి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూకుడు చూపిస్తుంది ఎఫ్2 సినిమా. ఒక‌టి రెండు కాదు ఏకంగా 50 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసి.. ఇప్పుడు 60 కోట్ల వైపు ప‌రుగులు తీస్తుంది ఈ చిత్రం. వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ ల‌కు కూడా కెరీర్ లో ఇదే పెద్ద హిట్. 9 రోజుల్లోనే ఈ చిత్రం 48 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇదే జోరు కొనసాగితే ఈ వారంలోనే 60 కోట్లు షేర్ వ‌సూలు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. 34 కోట్లు వ‌స్తే సేఫ్  అవుతుంది ఈ సినిమా. ఇప్ప‌టికే దానికి మించి మ‌రో 20 కోట్లు తీసుకొచ్చింది ఎఫ్2. మ‌రో 10 కోట్లు ఈజీగా తీసుకొచ్చేలా క‌నిపిస్తుంది. వెంకటేష్ ఉన్నాడు కాబట్టి కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమా వైపు పరుగులు తీస్తున్నారు.
F2 9 days WW collections
F2 9 days WW collections

దానికితోడు పండగ సినిమాల్లో బాగా నవ్వుకునేది ఇది ఒక్కటే కావడంతో కలెక్షన్లు కూడా కురుస్తుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్, వెంకటేష్, తమన్నా, మెహరీన్ కౌర్, దిల్ రాజు జాతకాలు మార్చేసింది. ఈ సినిమాకు ముందు అందరికీ ఫ్లాపులు ఉన్నాయి. ఇప్పుడు అందరి కష్టాలు కామన్ గా తీర్చేశారు అనిల్ రావిపూడి. మరో రెండు వారాల పాటు కొత్త సినిమాలు ఏమీ లేకపోవడం కూడా ఈ సినిమాకు కలిసి రానుంది. సంక్రాంతికి భారీ పోటీ ఉంది కాబట్టి ఎంత వసూలు చేస్తుందా లేదా అని ఆసక్తి అనుమానాలు ఉన్నా కూడా ఇప్పుడు అన్నీ పటాపంచలైపోయాయి. రెండో వారంలో కూడా జోరు తగ్గించకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మొత్తానికి పండగ సెలవులు బాగా క్యాష్ చేసుకున్న సినిమా ఒక ఎఫ్2 మాత్రమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here