జబర్దస్త్ కమెడియన్ లను తక్కువ అంచనా వేయొద్దు..

జబర్దస్త్ షో నే కదా అంటూ తక్కువ అంచనా వేస్తే వాళ్లను అవమానించినట్లే. ఎందుకంటే ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షో నుంచి చాలామంది ఇండస్ట్రీకి వచ్చి సత్తా చూపిస్తున్నారు. ఇప్పటికే ఆ స్టేజ్ మీదనుంచి ధనరాజ్, షకలక శంకర్ లాంటి వాళ్లు హీరోలు కూడా అయ్యారు. సక్సెస్ కాలేదు అది వేరే విషయం.. కానీ హీరోలయ్యారు. ఇప్పుడు మరో కమెడియన్ కూడా జబర్దస్త్ నుంచి వచ్చి హీరో అవుతున్నాడు. ఆయనే చమ్మక్ చంద్ర.

జబర్దస్త్ లో ఫ్యామిలీ స్కిట్స్ చేసి కడుపుబ్బ నవ్వించే చమ్మక్ చంద్ర ఇప్పుడు రామసక్కనోళ్లు సినిమాతో హీరో అవుతున్నాడు. రాజ నరేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సతీష్ అనే కొత్త నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.. త్వరలోనే విడుదల తేదీ పై క్లారిటీ ఇవ్వనున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాతో చమ్మక్ చంద్ర కచ్చితంగా హీరోగా గుర్తింపు తెచ్చుకుంటాడని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. మరి వాళ్ళ ఆశలు చంద్ర ఎంతవరకు నిలబెడతాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here