పాపం ఇప్పుడు అఖిల్ పరిస్థితి ఏంటి.. ఇండస్ట్రీతో పాటు ఇప్పుడు బయట కూడా అంతా ఇదే అడుగుతున్నారు ప్రస్తుతం. మరో పరాజయం దిశగా అడుగులు వేస్తున్నాడు అఖిల్. ఈయన నటించిన మిస్టర్ మజ్ను సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దీనికి తొలి రోజు ఊహించిన టాక్ రాలేదు. దానికి తోడు కలెక్షన్లు కూడా చాలా దారుణంగా వచ్చాయి. దాంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి లో పడిపోయాడు అక్కినేని వారసుడు. తెలుగు మిస్టర్ మజ్ను సినిమా కేవలం మూడు కోట్లు కూడా తీసుకు రాలేదు తొలిరోజు. ఈ విషయంలో అఖిల్ ముందు సినిమాలు చాలా ముందున్నాయి.
విక్రమ్ కె.కుమార్ తెరకెక్కించిన హలో సినిమాకు టాక్ చాలా బాగా వచ్చింది కానీ అప్పుడు నాని సినిమా పోటీలో ఉండటంతో ఫ్లాప్ అయ్యింది. ఇక ఇప్పుడు మిస్టర్ మజ్ను సినిమా యావరేజ్ టాక్ వచ్చింది కానీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర వెంకటేష్, వరుణ్ తేజ్ ఎఫ్2 సినిమా ఉంది. దాన్ని దాటి కలెక్షన్లు సాధించాలంటే అద్భుతం జరగాలి. కానీ ఇప్పుడు అద్భుతం జరిగేలా కనిపించడం లేదు. మిస్టర్ మజ్ను సినిమాలో మరో ఫ్లాప్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాతో మాయ చేయాలని ఆశపడిన అక్కినేని వారసుడికి మరోసారి నిరాశే ఎదురైంది. మన అఖిల్ కోరుకుంటున్న విజయం అందించిన దర్శకుడు ఎక్కడ ఉన్నాడో చూడాలి.