అంతిమ ఫలితం ఏమిటో తెలియకుండా యుద్ధం చేస్తున్నాడు నాగబాబు. బాలయ్య, ఈయన మధ్య మాటల యుద్ధం రోజురోజుకు హద్దులు మీరుతుంది. ఒక్కో రోజు ఒక్కో కామెంట్ విడుదల చేస్తూ ఫ్యాన్స్ కు మరింత కోపం తెప్పిస్తున్నాడు మెగా బ్రదర్. ఈయన తీరు చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా మరో కామెంట్ విడుదల చేశాడు నాగబాబు. అమితాబ్ బచ్చన్ ఏం పీకాడు.. చిరంజీవి ఏమయ్యాడు అంటూ అప్పట్లో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వీటిని ఇప్పుడు కౌంటర్ విడుదల చేశాడు నాగబాబు. దీనికి కౌంటర్ ఇస్తూ అందరూ ఇక్కడ మనుషులే అని ఎవరు పైనుంచి దిగిరాలేదని చెబుతున్నాడు నాగబాబు. మా బ్లడ్ వేరు.. మా బ్రీడ్ వేరు అంటూ బాలయ్య చేసిన డైలాగ్స్ సమంజసంగా లేవు అంటున్నాడు నాగబాబు.
ఆయన అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాడు మెగా బ్రదర్. ఎన్టీఆర్, ఎమ్జీఆర్, కన్నడ రాజ్ కుమార్ ఎంత పెద్ద స్టార్ హీరోలో అమితాబ్ బచ్చన్ కూడా అంతే. అలాంటి హీరోను ఇలా మాట్లాడొచ్చా అంటున్నాడు ఈయన. మధ్యలో చిరు పేరు ఎందుకు తీసుకొచ్చాడంటున్నాడు నాగబాబు. ఇవన్నీ రాజులకు ఉండాల్సిన లక్షణాలు.. నిరంకుశత్వానికి ప్రతీక అంటున్నాడు నాగబాబు. బాలకృష్ణ ఇలాంటి మాటలు అన్నపుడు ఎవరూ ఏం మాట్లాడలేదు.. ఇప్పుడు తాను మాట్లాడుతుంటే మాత్రం అందరికీ కోపాలు వచ్చేస్తున్నాయా అంటూ నిలదీస్తున్నాడు ఈయన. ఇంకా చాలా ఉన్నాయి ఇది ఆరంభం మాత్రమే అంటున్నాడు నాగబాబు.
Stay Tuned For Comment-4 @ 9 PM pic.twitter.com/CLU4JVRPr0
— Naga Babu (@ActorNagaBabu) January 7, 2019