అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి మాట్లాడిన నాగబాబు..

ఈ మధ్య కాలంలో సినిమాలు, జబర్దస్త్ కంటే బయట విషయాల్లోనే నాగబాబు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈయన ప్రతి విషయాన్ని తన చానల్లో విశ్లేషిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో మై ఛానల్ నా ఇష్టం అంటూ ఒక యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాడు నాగబాబు. అందులోనే రాజకీయ విషయాలతో పాటు బయటి విషయాలపై కూడా విశ్లేషిస్తున్నాడు మెగా బ్రదర్. తాజాగా అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశాడు నాగబాబు. అమ్మాయిలు ఎలా డ్రెస్సింగ్ చేసుకుంటే మీకు ఎందుకు.. వాళ్లు విప్పితే చొంగ కార్చుకునే వాళ్లు కూడా ఇప్పుడు వచ్చి నీతి సూక్తులు చెబుతున్నారు అంటూ ఓ రేంజ్ లో క్లాస్ పీకాడు మెగా బ్రదర్.

అమ్మాయిలు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అనేది పూర్తిగా వాళ్ల స్వేచ్ఛ అని.. అది కాదనే హక్కు ఎవరికీ లేదు అంటున్నాడు నాగబాబు. కేవలం మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవడం వల్ల తప్పుడు ఆలోచనలు వస్తాయి అంటే అంత కంటే దారుణం మరొకటి లేదు అంటున్నాడు మెగా బ్రదర్. అమ్మాయిల గురించి కామెంట్ చేసే ముందు వాళ్ల స్థాయి ఏంటో ఒకసారి చూసుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. లేడీస్ ను చూసి అందాలపై వెగటు కామెంట్స్ చేసే వాళ్లు కూడా ఇప్పుడు వచ్చి నీతి వాక్యాలు చెబుతున్నారు అంటూ సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. ఈయన మాటలపై జబర్దస్త్ యాంకర్ అనసూయ.. రష్మీ కూడా ట్విట్టర్లో సపోర్ట్ చేశారు. వీరే కాకుండా చాలా మంది హీరోయిన్లు నాగబాబు చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు. అమ్మాయిలు వేసుకునే దుస్తులను బట్టి వాళ్ల క్యారెక్టర్ ను డిసైడ్ చేయొద్దు అంటున్నారు వాళ్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here