NGK క్రియేటివిటీ @ పీక్స్..

ఈ రోజుల్లో క్రియేటివిటి చూపించ‌డానికి ప్లాట్ ఫామ్ తో ప‌నిలేదు. నీకు ద‌మ్ముంటే నీ స‌త్తా ప్ర‌పంచం చూస్తుంది. దానికి నీకు నువ్వు ప్లాట్ ఫామ్ ను సెట్ చేసుకోవాలంతే. ఇప్పుడు త‌మిళ‌నాట ఇదే చేసారు కొంద‌రు. సూర్య ఎన్ జి కే సినిమా పోస్ట‌ర్ ను త‌మ‌కు కావాల్సిన‌ట్లుగా మిగిలిన హీరోల‌కు అనున‌యించారు.

సెల్వ రాఘ‌వ‌న్ తెర‌కెక్కిస్తోన్న సినిమాకు ఎన్ జి కే అనే ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్ పెట్టారు. సూర్య ఇందులో చెగువేరా గెట‌ప్ లో క‌నిపిస్తున్నాడు. ఈ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ఇదే పోస్ట‌ర్ లో మిగిలిన హీరోలు ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచ‌న‌తో కొన్ని పోస్ట‌ర్లు డిజైన్ చేసారు కొంద‌రు ఔత్సాహికులు. ర‌జినీకాంత్.. క‌మ‌ల్ హాస‌న్.. విజ‌య్.. అజిత్ తో పాటు శింబు, విజ‌య్ సేతుప‌తి, శివ కార్తికే య‌న్ కూడా ఈ ఎన్ జి కే పోస్ట‌ర్స్ లో ఉన్నారు. ఈ పోస్ట‌ర్ చూసిన త‌ర్వాత సూర్య కూడా ఫిదా అయ్యాడు. వాళ్లు చేసిన వ‌ర్క్ మెచ్చుకున్నాడు. ఎన్ జి కే సినిమాపై ఇప్పుడు అంచ‌నాలు బాగానే పెరిగిపోయాయి. సాయిప‌ల్ల‌వి, ర‌కుల్ ఇందులో సూర్య‌తో జోడీ క‌డుతున్నారు. ఇదే ఏడాది ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది ఎన్ జి కే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here