అఖిల్ కు జూనియ‌ర్ ఎన్టీఆర్ సాయం.. ప‌నిచేస్తుందా మ‌రి..?

ఏం చేసినా సరే ఒక్క హిట్టు కొట్టాలని ఆరాటపడుతున్నాడు అఖిల్. ఇప్పటివరకు నేను చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో మూడో సినిమాతో కచ్చితంగా విజయం అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు అక్కినేని వారసుడు. దానికోసం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలను కూడా వాడేస్తున్నాడు. తాజాగా ఈయ‌న నటిస్తున్న మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు. జనవరి 19న jrc కన్వెన్షన్ హాల్లో ఈ వేడుక జరగనుంది.

ఇప్పటికే అఖిల్ ప్రతి సినిమా ఆడియో వేడుక‌ల‌కు స్టార్ హీరోలు ముఖ్య అతిథులుగా రావడం ఆనవాయితీగా మారింది. అఖిల్ ఆడియో రిలీజ్ కు మహేష్ బాబు ముఖ్య అతిథిగా వచ్చాడు.. ఆ తర్వాత హలో వేడుకకు చిరంజీవి, రామ్చరణ్ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వంతు. తనకు అఖిల్ తో మంచి సాన్నిహిత్యం ఉంది.

దాంతో ఈ వేడుకకు వస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి వారసుడు రావ‌డంతో అక్కినేని వారసుడికి కలిసి వస్తుందని నమ్ముతున్నారు అభిమానులు. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది. బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇందులో హీరోయిన్ గా నటించింది. మొత్తానికి చూడాలి జూనియర్ ఎన్టీఆర్ రాక అఖిల్ రాత‌ను మార్చేస్తుందో లేదో..?

akhil mr majnu pre release event ntr as chief guest

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here