2019 సంక్రాంతి సినిమాల్లో బిజినెస్ పరంగా అగ్రపీఠం రామ్ చరణ్ దే. అయినా కూడా లాభాల పరంగా మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ ముందువరుసలో నిలుస్తుంది. ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం రైట్స్ రూపంలోనే బాలయ్యను లాభాల్లో ముంచుతుంది ఈ చిత్రం. ముఖ్యంగా కథానాయకుడు డిజిటల్ రైట్స్ ఏకంగా 25 కోట్లకు అమ్మడయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర హక్కులను అమేజాన్ సంస్థ 25 కోట్లకు చేజిక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే గాని నిజమైతే ఎన్టీఆర్ బయోపిక్ సరికొత్త సంచలనాలకు తెర తీసినట్లే. బడ్జెట్లో దాదాపు సగానికి పైగా ఈ రైట్స్ రూపంలోనే వస్తున్నాయి. పైగా రెండు భాగాలుగా తెరకెక్కించడం ఎన్టీఆర్ బయోపిక్ కు బాగా కలిసొస్తుంది.
రెండో భాగం మహానాయకుడు కూడా 20 కోట్ల వరకు డిజిటల్ రైట్స్ రూపంలో వస్తున్నాయని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు కలిపితే దాదాపు 50 కోట్లు కేవలం డిజిటల్ హక్కుల రూపంలోనే బాలయ్య ఖాతాలో చేరబోతున్నాయి. ఇదిలా ఉంటే శాటిలైట్ రైట్స్ అదనం. అటు శాటిలైట్ ఇటు డిజిటల్ కలిపి బాలయ్య పండగ చేసుకుంటున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ కు హక్కుల రూపంలోనే దాదాపు 85 కోట్లు వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ రైట్స్ రూపంలో వచ్చినట్లే. మొత్తానికి పక్కా ప్లానింగ్ తో నిర్మాతగా తొలి సినిమా విడుదలకు ముందే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు బాలకృష్ణ. పైగా పైనుంచి తండ్రి ఆశీస్సులు ఎలాగూ ఉన్నాయి.