పేట.. అంత రన్ టైమ్ వర్కవుట్ అవుతుందా..?

ఈ రోజుల్లో సినిమా రన్ టైం రెండున్నర గంటలు ఉంటేనే ఎక్కువ అయిపోయిందని ఫీలవుతున్నారు అభిమానులు. అలాంటిది ఏకంగా మూడు గంటల సినిమా తీస్తే చూస్తారా..? విషయం ఉంటే కచ్చితంగా చూస్తారు అని కొన్ని సినిమాలు ఇప్పటికే నిరూపించాయి. గతేడాది వచ్చిన రంగస్థలం, భరత్ అనే నేను లాంటి సినిమాలు మూడు గంటల నిడివితో వచ్చాయి. దానికి ముందు అర్జున్ రెడ్డి కూడా అలాగే వచ్చింది. ఇప్పుడు ఇదే కోవలో రజినీకాంత్ పేట సినిమా కూడా వస్తుంది. ఈ సినిమా ర‌న్ టైమ్ 2 గంట‌ల 52 నిమిషాలు. ఇది కాస్త ఎక్కువ అనిపించినా కూడా రజనీకాంత్ లాంటి హీరోకి తక్కువే.

Rajini Petta Movie Telugu Rights Sold
ఆయన సినిమాకు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మూడు గంటలు కాదు కదా నాలుగు గంటలు ఉన్న అభిమానులు చూస్తారు. ఆ నమ్మకంతోనే ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ పేటను 2 గంట‌ల 52 నిమిషాల‌ నిడివితో తీసుకొస్తున్నాడు. ఈ సంక్రాంతి సినిమాల్లో రజనీకాంత్ సినిమాపై అంచనాలు తక్కువగా ఉన్నాయి. కానీ ట్రైలర్ విడుదలైన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. విడుదల తర్వాత కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తుందని నమ్ముతున్నాడు కార్తీక్. రజనీకాంత్ కూడా ఇదే నమ్మకంతో కనిపిస్తున్నాడు. మరి ఇంత భారీ నిడివితో వస్తున్న పేట ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తుంది అనేది ఆస‌క్తిక‌రంగా మారిందిప్పుడు. జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానుంది పేట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here