ర‌కుల్ డ్ర‌స్ పై సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌..

రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. ఓ నెటిజ‌న్ పై ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. పొట్టి బట్టలు వేసుకోవడంపై ఒక నెటిజన్ ఈ అమ్మడుపై కాస్త రెచ్చిపోయి కామెంట్ చేశాడు. చిన్న‌ నిక్కర్ వేసుకున్న ఫోటో చూసి కార్ లోనే సెష‌న్స్ పూర్తి అయిపోతే ఫ్యాంట్ వేసుకుని టైం దొరకదు అంటూ అతను రకుల్ డ్రెస్ పై చీప్ కామెంట్ చేశాడు.

దానికి వెంటనే రియాక్ట్ అయిన రకుల్ ప్రీత్ సింగ్.. మీ అమ్మ ఇలాంటివి చాలానే చేసి ఉంటుంది కారులో.. అందుకే నువ్వు బాగా ఎక్స్పర్ట్ అయిపోయావు.. వెళ్లి మీ అమ్మని అడుగు చెబుతుంది అంటూ రిప్లై ఇచ్చింది. అంతటితో ఊరుకోకుండా మేము ఏ డ్రెస్ వేసుకుంటే మీకెందుకు.. అంతగా మాట్లాడేవాడివి అయితే ఆడవాళ్లపై అరాచకాలు జరుగుతున్నప్పుడు ఎందుకు నోరు విప్పలేదు.. ఇప్పుడు ఎందుకు ఇలా కామెంట్ చేస్తున్నారు.. కచ్చితంగా నువ్వు చేసిన ఈ పనికి మీ అమ్మ చెంప చెల్లుమనిపించింది అని కోరుకుంటున్నాను అంటూ మరో రిప్లై ఇచ్చింది.

ఇప్పుడు ఈమె డ్రెస్ పై కాంట్రవర్సీ సోషల్ మీడియాలో బాగానే నడుస్తుంది. ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే అలాంటి కామెంట్లు వినడానికి కూడా సిద్ధంగా ఉండాలి అంటూ కొందరు రకుల్ కు రివర్స్ కౌంటర్ కూడా వేస్తున్నారు కొంద‌రు. మరి దీనిపై ఈ ముద్దుగుమ్మ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో చూడాలి.rakul preet jeans shorts pic trolled

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here