ఓటమి ఒప్పుకోడానికి కూడా ధైర్యం కావాలి.. ఫ్లాప్ అయిన సినిమాలు కూడా హిట్ అని చెప్పుకుంటారు కొందరు హీరోలు. కానీ మెగా హీరోలు మాత్రం ఈ విషయంలో చాలా మంది ఉంటారు. ఆ మధ్య అంతరిక్షం సినిమా ఫ్లాప్ అయినప్పుడు బయటికి వచ్చి ధైర్యంగా తన సినిమా అంచనాలు అందుకోనందుకు ప్రేక్షకులకు సారీ చెప్పాడు వరుణ్ తేజ్. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే చేశాడు. ఈయన నటించిన వినయ విధేయ రామ సినిమా సంక్రాంతికి విడుదలై దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది.
బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ వాటిని అందుకోవడంలో దారుణంగా విఫలమైంది వినయ విధేయ రామా. దాంతో బయ్యర్లు కూడా భారీగానే నష్ట పోయారు. ఇప్పుడు వాళ్లను ఆదుకునే కార్యక్రమం రామ్ చరణ్ తో పాటు నిర్మాత దానయ్య కూడా తీసుకున్నాడు.. తమ సినిమాను నమ్మి నష్టపోయిన బయ్యర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చాడు మెగా వారసుడు. కష్టపడి సినిమా చేశామని.. కానీ విజువల్ వచ్చేసరికి నిరాశపరిచింది అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. కచ్చితంగా తర్వాత సినిమా విధంగా ఉంటుంది మాటిచ్చాడు రామ్ చరణ్. ఏదేమైనా ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత అది ఫ్లాప్ అని అఫీషియల్ గా ప్రెస్ నోట్ విడుదల చేయడం కూడా గొప్ప విషయమే. అది ఇప్పుడు రాంచరణ్ చేసి అభిమానులు ఇంకా ఎక్కువ ఇమేజ్ తెచ్చుకున్నాడు.