వ‌న్ క‌ళ్యాణ్ తో అలీ భేటీ.. అస‌లు నిజాలేంటో మ‌రి..?

పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే ప్రాణాలు వదిలే వరకు ఆయనతోనే ఉంటామంటూ ఇంతకుముందు చాలా మంది ఇండస్ట్రీలో చెప్పారు. కానీ ఇప్పుడు ఆ చెప్పిన వాళ్లంతా వేరే వేరే పార్టీలో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే బండ్ల గణేష్ కాంగ్రెస్ గూటికి చేరారు. బై బర్త్ పవన్ కళ్యాణ్ భక్తుడు అని చెప్పుకునే ఈయన ఎవరు ఊహించని విధంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు. ఇక ఇప్పుడు కమెడియన్ అలీ కూడా వైసీపీలో చేరడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగానే పవన్ తో భేటీ అయ్యారని తెలుస్తుంది. జనసేన పార్టీ మీటింగ్ లతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా వెళ్లి కలిశారు అలీ.

pawan kalyan comedian ali ys jagan chandrababu

వీళ్లిద్దరి మీటింగ్ సారాంశం ఏంటో తెలియదు కానీ ఖచ్చితంగా అది మాత్రం వైసీపీలో చేరుతున్నారనేది అర్థమైపోతుంది. ఈ మధ్య జగన్ ని క‌లిసి ఆయ‌న‌తో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు కాకపోతే త‌ర్వాతైనా కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని ఫిక్స్ అయిపోయాడు అలీ. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ను కలిసి అలీ ఏం మాట్లాడి ఉంటాడు అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. జగన్ పార్టీలో జాయిన్ కావడానికి ఆశీర్వాదాలు తీసుకున్నాడా లేదంటే జనసేనలో జాయిన్ అవుతాన‌ని అని అడగడానికి వచ్చాడా అని ఎవరికి తోచినట్లు వాళ్ళు క‌థ‌లు అల్లుకుంటున్నారు. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్లి పోయాడు అలీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here