వ‌ర్మ మ‌ళ్లీ కెలికాడు.. ఎందుకు అంటూ సాంగ్ విడుద‌ల‌..

అసలే మంట మండుతుంది.. దాన్ని ఆర్పేయాల్సింది పోయి పెట్రోల్ వస్తున్నాడు వర్మ. బేసిక్ గానే ఆయ‌న‌ మనస్తత్వం ఇదే. వివాదాలను కోరి మరీ తెచ్చుకున్నాడు.. లేదంటే వివాదాలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళతాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. ఎన్టీఆర్ కథానాయకుడు ఇంకా ఒక్క రోజులోనే విడుదలవుతుంది అనగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని ఎందుకు అనే పాట విడుదల చేసాడు ఈ దర్శకుడు.

ఇప్పటికే వెన్నుపోటు సాంగ్ చాలా పాపులర్ అయింది. అందులో చంద్రబాబునాయుడు ఫోటోలు వాడేసి తెలుగు త‌మ్ముళ్ల‌కు కోపం తెప్పించాడు వ‌ర్మ‌. రాంగోపాల్ వర్మ దొరికితే నరికేస్తామంటూ తెలుగు త‌మ్ముళ్లు కూడా మ‌ర్యాద‌గా వార్నింగ్ ఇచ్చారు. ఇక వర్మ కూడా జీవితంలో ఇలాంటివి నేను ఎన్ని చూడలేదు అన్నట్టు లైట్ తీసుకున్నాడు.

ఇప్పుడు వెన్నుపోటు సాంగ్ అందరూ మరిచిపోయేసరికి ఎందుకు అంటూ మరో పాటతో వ‌చ్చాడు. అది కూడా కేవలం కథానాయకుడు సినిమాకు ఒక్క రోజు ముందు విడుదల చేసాడు ఆర్జీవి. ఈ జీవి తెలివి అర్థం చేసుకోవ‌డం అంత ఈజీ కాదు. ఇలా చేయడం ఎవరికి కొత్తగా కనిపించడం లేదు వింతగా అసలే అనిపించడం లేదు.

ఎందుకంటే ఆయ‌న స్టైల్ ఇదే. కాంట్రవ‌ర్సీల‌ని వాడుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు కూడా తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్ కోసం ఈ పాటను విడుదల చేసి క్యాష్ చేసుకుంటున్నాడు ఆర్జీవి. జనవరి 25న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల అవుతుందని చెబుతున్నారు కానీ వచ్చే వరకు అనుమానంగానే కనిపిస్తోంది. అసలు ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది అనేది ఇప్పటి వరకు ఎవరికీ క్లారిటీ లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here