గెట్ రెడీ ఫ్యాన్స్.. మళ్ళీ సినిమాల్లోకి శృతిహాసన్..

శృతిహాసన్ అభిమానులకు శుభవార్త.. ఈమె మళ్ళీ సినిమాల్లోకి వస్తుంది. కొన్నేళ్లుగా మ్యూజిక్ తోనే సమయం గడిపేస్తున్న ఈ భామ.. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రావాలని ఫిక్స్ అయిపోయింది. ఆ మధ్య మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో శృతిహాసన్ చాలా ఇబ్బంది పెట్టింది అంటూ దర్శక నిర్మాతలు కంప్లైంట్ చేశారు. ఇప్పటి వరకు ఇది పూర్తి కాలేదు. 2016 లో విడుదలైన బెహన్ హోగా తేరి సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు శృతి హాసన్. పూర్తిగా మ్యూజిక్ బ్యాండ్ పైనే దృష్టి పెట్టింది. దానికి తోడు బాయ్ ఫ్రెండ్ తో ఫారిన్ టూర్ లో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

ఇలాంటి సమయంలో మళ్లీ శృతిహాసన్ ఒక తమిళ సినిమా ఉందని తెలుస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా జయంతన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో శృతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి లాభం అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. జగపతిబాబు విలన్ గా నటించబోతున్నాడు. ఇదే ఏడాది షూటింగ్ మొదలు కానుంది. మూడేళ్లుగా తమిళనాట కూడా ఏ సినిమా ఒప్పుకోలేదు శృతిహాసన్. ఇన్నాళ్లకు విజయ్ సేతుపతి సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ ముద్దుగుమ్మ. దాంతో అభిమానులు కూడా సంతోషంగా ఫీలవుతున్నారు. ఇకపై వరుసగా సినిమాలు చేయడానికి మెంటల్ గా ఫిక్స్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. మ్యూజిక్ విషయంలో ఈ భామకు అనుకున్న విజయాలు అందడం లేదు. దాంతో అచ్చొచ్చిన ఇండస్ట్రీ వైపు మళ్ళీ వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో శృతిహాసన్ కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here