శ్రీ విష్ణు కోరమీసంతో కుమ్మేసాడు..

శ్రీ విష్ణు సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించడం లేదు కానీ ఆయన సినిమాలు మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. రెండేళ్ల కింద నటించిన అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ లాంటి సినిమాలు అతడిలోని నటున్ని ప్రత్యేకంగా చూపించాయి. మెంటల్ మదిలో లాంటి సినిమాలతో కమర్షియల్ gaa కూడా పర్లేదు అనిపించుకున్నాడు శ్రీ విష్ణు. ఇక ఇప్పుడు ఈయన తిప్పరా మీసం అంటూ ఒక ఫుల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. శ్రీ విష్ణు లుక్ చాలా కొత్తగా ఉంది.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

sree vishnu tippara meesam

పగిలిన అద్దాలు అతని క్యారెక్టరైజేషన్ చూపిస్తున్నాయి. అసుర సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కృష్ణ విజయ్ ఎల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హీరో శ్రీవిష్ణుతో ఈయనకు ఇదే తొలి సినిమా. యాక్షన్ డ్రామాగా తిప్పరా మీసం తెరకెక్కుతుంది. నిక్కి తంబోలీ, రోహిణి ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అచ్యుత్ రామారావు, బెనర్జీ, రవిప్రకాష్, రవి వర్మ, నవీన్ నేని, ప్రవీణ్, నేహా దేశ్ పాండే తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సిధ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తిప్పరా మీసం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ ఓం సినిమా బ్యానర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here