రాజుగారి అతికి బ్రేకులు ప‌డ్డట్లేనా..?

దిల్ రాజు అంటే బ్రాండ్. ఈయ‌న నుంచి సినిమా వ‌చ్చిందంటే.. ద‌ర్శ‌కుడు, హీరోతో కూడా ప‌నిలేదు. రాజుగారి బ్రాండ్ తోనే సినిమాలు ఆడేస్తాయి. అంత‌గా ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు దిల్ రాజు. అయితే ఎంత పెద్ద సామ్రాజ్యం అయినా కూడా చిన్న‌పాటి గాలివాన‌కు కూడా ఒక్కోసారి కూలిపోతుంటుంది. ఈ విష‌యం దిల్ రాజుకు కూడా తెలియంది కాదు. కానీ అతి న‌మ్మ‌క‌మో.. లేదంటే ఉన్న క‌థ‌పై న‌మ్మ‌కమో తెలియ‌దు కానీ ఒక్కోసారి మ‌రీ ఎక్కువ‌గా ఓ సినిమా గురించి చెప్పేస్తుంటాడు రాజు.
dillraju
ఇప్పుడు శ్రీ‌నివాస క‌ళ్యాణం విష‌యంలో ఇదే జ‌రిగింద‌ని అంతా అంటున్నారు. ఈ సినిమాలో రాజుగారు చెప్పినంత విషయం లేదు.. అందుకే విజ‌యం కూడా వాళ్లు అనుకున్నంత రావ‌డం లేదు. ఇప్పుడు శ్రీ‌నివాస క‌ళ్యాణంకు దిల్ రాజు అండ్ టీం కోరుకుంటున్న‌ది కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ కాదు.. జ‌స్ట్ సేఫ్ జోన్ కు వ‌స్తే చాల‌ని.
ఎందుకంటే ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే అది కూడా క‌ష్ట‌మే అనిపిస్తుంది. తొలిరోజు 3 కోట్ల‌కు పైగా షేర్ సాధించిన ఈ చిత్రం రెండోరోజు అంత‌కంటే త‌క్కువ‌గానే తీసుకొచ్చింది. తొలి నాలుగురోజుల్లో క‌నీసం 15 కోట్లు రాక‌పోతే క‌ళ్యాణం జ‌ర‌గ‌డం క‌ష్ట‌మే. మొత్తానికి దిల్ రాజు అతికి ఇప్పుడు కాస్త బ్రేకులు ప‌డ్డ‌ట్లే తెలుస్తుంది. ఓ సినిమా గురించి ఇంత‌గా చెప్ప‌కూడ‌ద‌ని మ‌రోసారి అర్థ‌మైంది ఈ నిర్మాత‌కు. ల‌వ‌ర్ షాక్ నుంచి కోలుకోక‌ముందే శ్రీ‌నివాస క‌ళ్యాణం కూడా తేడా కొడుతుండ‌టంతో ఆలోచ‌న‌లో ప‌డుతున్నాడు దిల్ రాజు. మ‌రి ఇప్పుడు రాబోయే రామ్ హ‌లో గురు ప్రేమ‌కోస‌మే ఎలా ఉండ‌బోతుందో..? అక్టోబ‌ర్ 18న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here