రెండ్రోజుల ముందే శ్రీ‌నివాస క‌ళ్యాణం..

అదేంటి.. విడుద‌ల తేదీ కానీ ప్రీ పోన్ అయిందా ఏంటి.. ఇంక పండ‌గ చేసుకోవ‌చ్చు అనుకుంటున్నారా..? అలాంటిదేం లేదు.. ఆశ‌లేం పెట్టుకోవ‌ద్దు.. కాక‌పోతే దిల్ రాజు ఈ సారి కాస్త కొత్త‌గా ఆలోచిస్తున్నాడు. త‌న సినిమాను రెండు రోజుల ముందే ప్రీమియ‌ర్ వేయాల‌ని చూస్తున్నాడు. సాధార‌ణంగా విడుద‌ల కంటే ఒక్క రోజు ముందు కూడా త‌న సినిమా ప్రీమియ‌ర్ కు ఒప్పుకోడు ఈ నిర్మాత‌. కానీ ఇప్పుడు మాత్రం శ్రీ‌నివాస క‌ళ్యాణంపై ఉన్న న‌మ్మ‌కంతో రెండ్రోజుల ముందే షో వేస్తే మ‌రింత పాజిటివ్ టాక్ తో సినిమా ప్రేక్ష‌కుల్లోకి వెళ్తుంద‌ని భావిస్తున్నాడు దిల్ రాజు. అన్నీ కుదిర్తే ఆగ‌స్ట్ 7 కానీ.. 8 కానీ రాత్రి ప్రీమియ‌ర్ షో ప‌డ‌బోతుంది. సెలెబ్రెటీస్ తో పాటు మీడియా కూడా ఇందులో భాగం కానుంది. ఈ సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలున్నాయి.
అటు ఓవ‌ర్సీస్ లో కూడా ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. అక్క‌డ‌ హక్కుల్ని ప్ర‌ముఖ సంస్థ 3 కోట్లకు కొన్న‌ట్లు తెలుస్తుంది. నితిన్ లాంటి హీరోకు ఇది చాలా ఎక్కువ‌. ఎందుకంటే ఈయ‌న కెరీర్ లో అ..ఆ మాత్ర‌మే అక్క‌డ అద్భుతాలు చేసింది. అది కూడా త్రివిక్ర‌మ్ క్రేజ్ తో.
కానీ ఇప్పుడు అ..ఆ తర్వాత అంత భారీ రేట్ పెట్టి తీసుకుంటున్న సినిమా శ్రీ‌నివాస క‌ళ్యాణ‌మే. లై.. ఛ‌ల్ మోహ‌న్ రంగా సినిమాలు డిజాస్ట‌ర్స్ గా నిలిచినా కూడా స‌తీష్ వేగేశ్న‌.. దిల్ రాజు బ్రాండ్ తో శ్రీ‌నివాస క‌ళ్యాణం అక్క‌డ కూడా భారీ రేట్ కు అమ్ముడైంది. క‌చ్చితంగా ఈ చిత్రం విదేశాల్లో అద‌ర‌గొడుతుంద‌ని న‌మ్ముతున్నాడు దిల్ రాజు. 3 కోట్ల‌ను వెన‌క్కి తీసుకురావ‌డం అంటే మాట‌లు కాదు.. క‌చ్చితంగా ఈ చిత్రంతో మిలియ‌న్ డాల‌ర్స్ వ‌సూలు చేస్తే కానీ నితిన్ సినిమా సేఫ్ కాన‌ట్లే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here