విద్య క‌థ‌కు ప‌డింది.. డ‌బ్బుల‌కు కాదు.. 

ఎన్టీఆర్ సినిమాలో విద్యాబాల‌న్ హీరోయిన్ అని తెలియ‌గానే అంతా ఒక్క‌టే అనుకున్నారు.. బాల‌య్య భారీగా ముట్ట‌చెప్పి మ‌రీ విద్యాను తెలుగు ఇండ‌స్ట్రీకి తీసుకొచ్చాడని. ఎందుకంటే దీనికంటే ముందే రెండు మూడు సినిమాల‌కు నో చెప్పింది విద్యాబాలన్. చిరంజీవి సైరా కోసం ముందు విద్యా బాల‌న్ ను అనుకున్నాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. దానికంటే ముందు బాల‌య్య కూడా అప్ప‌ట్లో శాత‌క‌ర్ణి కోసం ఈమెనే ముందు హీరోయిన్ గా తీసుకోవాల‌ని ప్ర‌య‌త్నించాడు. కానీ అప్పుడు కుద‌ర్లేదు.. ఇప్పుడు కుదిరింది.
Vidya Balan
ఎన్టీఆర్ బ‌యోపిక్ లో న‌టించ‌డానికి విద్యాబాల‌న్ కు మూడు కోట్లు ఇచ్చారనే ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే ఈ సినిమా కోసం కేవ‌లం కోటిన్న‌ర మాత్ర‌మే విద్యాబాల‌న్ కు ముట్టింది. చాలా త‌క్కువ రెమ్యున‌రేష‌న్ కే ఈ సినిమా చేస్తుంది విద్యాబాల‌న్. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు.
సినిమా అంతా ఈమె కోణంలో సాగ‌నుంది. ఎన్టీఆర్ బ‌యోపిక్ మొద‌లు అయ్యేది.. ముగిసేది బ‌స‌వ‌తార‌కం కోణంలోనే. ఆమె క‌థ‌ను ముందుకు తీసుకెళ్తుంది. సినిమాలో ఎంత‌మంది ఉన్నా బాల‌య్య త‌ర్వాత అంత ప్రాముఖ్యత ఉన్న పాత్ర విద్యాబాల‌న్ దే. అందుకే త‌క్కువ పారితోషికం అయినా కూడా క‌థ న‌చ్చి ఒప్పుకుంది విద్యాబాల‌న్.
1942లో ఎన్టీఆర్ జీవితంలోకి బ‌స‌వ‌తార‌కం వ‌చ్చింది. 1985లో చ‌నిపోయింది. అంటే ఎన్టీఆర్ బ‌యోపిక్ కూడా ఈ 45 ఏళ్ల గ్యాప్ లోనే జ‌ర‌గ‌నుంది. అంటే ఎన్టీఆర్ జీవితంలోని కాంట్ర‌వ‌ర్సీల‌ను ఎక్కువ‌గా చూపించ‌డం లేదు ఇందులో. విద్యాబాల‌న్ హీరోయిన్ కావ‌డంతో బాలీవుడ్ లోనూ ఈ చిత్రానికి మంచి గిరాకీ ఉండ‌టం ఖాయం. క్రిష్ ప్ల‌స్ విద్యాబాల‌న్ క్రేజ్ తో ఎన్టీఆర్ బ‌యోపిక్ కు అక్క‌డ కూడా మంచి క్రేజ్ రావ‌డం ఖాయం. జ‌న‌వ‌రి 9, 2019న విడుద‌ల కానుంది ఈ చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here