విన‌య విధేయ రామ క‌లెక్ష‌న్ల‌పై సోషల్ మీడియాలో ర‌గ‌డ‌..

ఈ రోజుల్లో ఏవి ఫేక్ కలెక్షన్లు.. ఏవి అసలు కలెక్షన్లు అని తెలుసుకోవడం కష్టంగా మారిపోయింది. వచ్చిన ప్రతి పెద్ద సినిమాకు 100 కోట్ల పోస్టర్ విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. సంక్రాంతికి విడుదలైన రామ్ చరణ్ వినయ విధేయ‌ రామ సినిమా విషయంలో కూడా ఇప్పుడు ఇదే రచ్చ జరుగుతుంది. ఈ సినిమాకు తొలి రోజు డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇది చూసిన తర్వాత సినిమా డిస్ట్రిబ్యూటర్లను ముంచేయడం ఖాయం అని ఫిక్సయిపోయారు అంతా. కానీ 12 రోజుల తర్వాత వినయ విధేయ రామ‌ 62 కోట్ల షేర్ తీసుకువచ్చింది అంటూ నిర్మాతలు చెబుతున్నారు. అంటే దాదాపు 90 కోట్లకు పైగా గ్రాస్ అన్నమాట.

Charan Latest Poster from VVR

అంతటి డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమా ఇన్ని కోట్లు ఎలా కలెక్ట్ చేసింది అని అడుగుతున్నారు యాంటీ ఫ్యాన్స్. కావాలనే కలెక్షన్లు పెంచి చెబుతున్నారని.. రెండో రోజు నుంచే చాలా చోట్ల థియేటర్ల‌లో జనం లేరని వాళ్లు సెటైర్లు వేస్తున్నారు. అలాంటిది ఇన్ని కోట్లు ఎలా వచ్చాయని.. ఎక్కడినుంచి వచ్చాయని అడుగుతున్నారు. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకు ఫేక్ కలెక్షన్లు చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది.

ఏడాదిన్నర కింద వచ్చిన మహేష్ బాబు స్పైడర్ సినిమా ఎంత పెద్ద డిజాస్టరో అందరికీ తెలుసు. ఆ సినిమాకు 150 కోట్ల పోస్టర్ విడుదల చేసి విమర్శల పాలయ్యారు నిర్మాతలు. ఇప్పుడు విన‌య విధేయ రామ విషయంలో కూడా ఇదే జరుగుతుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఏదేమైనా నిజం నిర్మాతలకు తెలుసు. వాళ్లు కావాలని పబ్లిసిటీ చేసుకున్నా కూడా నష్టపోయేది వాళ్లే.. ఆ త‌ర్వాత‌ డిస్ట్రిబ్యూటర్లకు ఈ చుక్కలు తప్పవు. మొత్తానికి రామ్ చరణ్ సినిమా ఎంత వసూలు చేసింది అనేది మరికొన్ని రోజుల్లోనే తేలనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here