అల్లుడు అదిరిపోయాడుగా..

Naga Chaitanya Shailaja Reddy Alludu
నాగ‌చైత‌న్య ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని సినిమాలు చేసినా.. ఇప్ప‌టికీ మార్కెట్ మాత్రం మ‌నోడితో ఆడుకుంటూనే ఉంది. అదే 20 కోట్ల రేంజ్ లో ఉన్నాడు చైతూ. ఏ స‌పోర్ట్ లేని నాని కూడా 40 కోట్ల‌కు వెళ్లిపోతే ఇంకా నాగ‌చైత‌న్య మాత్రం అక్క‌డే ఉన్నాడు. ఇప్పుడు ఈయ‌న న‌టిస్తున్న శైల‌జారెడ్డి అల్లుడుతో ఆ కోరిక తీరుతుంద‌ని న‌మ్ముతున్నాడు ఈ కుర్ర హీరో. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాలో లేనంత స్టైలిష్ గా ఇందులో క‌నిపిస్తున్నాడు చైతూ.
మీసాలు.. గ‌డ్డంతో పాటు టాప్ టూ బాట‌మ్ స్టైల్ మార్చేసాడు. మారుతి కూడా ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు పెంచేస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న కెరీర్ లో ఫ్లాప్ లేదు. బాబు బంగారం లాంటి సినిమాలు కూడా అబౌ యావ‌రేజ్ గా ఆడేసాయి. మ‌హానుభావుడుతో మ‌ళ్లీ హిట్ కొట్టి ఫామ్ లోకి వ‌చ్చాడు.
దాంతో అల్లుడు క‌చ్చితంగా అద‌ర‌గొడ‌తాడ‌ని న‌మ్ముతున్నారు ప్రేక్ష‌కులు కూడా. అను ఎమ్మాన్యువ‌ల్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ అత్త‌గా న‌టిస్తుంది. ఆగ‌స్ట్ 31న సినిమా విడుద‌ల‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో స‌రైన హిట్ లేని అను ఎమ్మాన్యువ‌ల్ కు అల్లుడు కీల‌కంగా మారాడు. ఇక చైతూ కూడా యుద్ధంశ‌ర‌ణంతో ఫ్లాప్ ఇచ్చాడు. దాంతో ఇద్ద‌రూ ఈ సినిమాతో ఫామ్ లోకి రావాల‌ని చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here