విక్ర‌మ్ మ‌ళ్లీ అదే చేస్తున్నాడా..?


ఇండ‌స్ట్రీలో ఒక్కో ద‌ర్శ‌కుడికి ఒక్కో ఇమేజ్ ఉంటుంది. చేసింది త‌క్కువ సినిమాలే అయినా కూడా విక్ర‌మ్ కే కుమార్ కూడా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ సృష్టించుకున్నాడు. ఈయ‌న సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రేక్ష‌కుల‌కు ఓ ఐడియా అయితే ఉంది. ప్రేమ‌లో కూడా యాక్ష‌న్ ను చూపించే ర‌కం ఈ ద‌ర్శ‌కుడు. హ‌లోలో ఇదే చేసాడు. ఇప్పుడు ఈయ‌న బ‌న్నీతో సినిమా చేయ‌బోతున్నాడు. క‌థ‌లో కాసిన్ని మార్పులు చెప్పినా ఇప్పుడు అన్నీ ఓకే అయిపోయాయి.
దాంతో త్వ‌ర‌లోనే ఈ జోడీ సినిమా చేయ‌బోతుంది. ఈ చిత్రం 100 కోట్ల బ‌డ్జెట్ తో రూపొంద‌నుంద‌ని.. రేసుగుర్రం నిర్మాత న‌ల్ల‌మ‌లుపు బుజ్జి నిర్మించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. అయితే విక్ర‌మ్ చేసిన ప్ర‌యోగాల‌కు ఇప్ప‌టికే హ‌లోతో నాగార్జున‌.. 24తో సూర్య బ‌లైపోయారు. కానీ మంచి పేరు వ‌చ్చింది. క‌మ‌ర్షియ‌ల్ గా డ‌బ్బులు మాత్రం రాలేదు. మ‌రిప్పుడు బ‌న్నీతో క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేస్తున్నాడా లేదంటే మ‌ళ్లీ ప్ర‌యోగ‌మే చేస్తాడా అనేది మాత్రం ఇప్పటికి స‌స్పెన్స్.
ఒక్క‌టి మాత్రం నిజం. ఇందులో కూడా యాక్ష‌న్ పార్ట్ అదిరిపోనుంద‌ని. అందుకే బ‌న్నీ కూడా ఈ చిత్రం కోసం ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రంతో పాటే త్రివిక్ర‌మ్ సినిమా కూడా చేయ‌బోతున్నాడు బ‌న్నీ. ఈ చిత్రాన్ని డివివి దాన‌య్య నిర్మించ‌నున్నాడు. ఈ రెండు సినిమాలు వ‌చ్చే రెండేళ్ల‌లో తెర‌కెక్క‌నున్నాయి. నా పేరు సూర్యతో ఫ్లాప్ ఇచ్చిన బ‌న్నీకి క‌చ్చితంగా హిట్ కొట్ట‌డం ఇప్పుడు అవ‌స‌రం. మ‌రి ఈ లోటు తీర్చే ద‌ర్శ‌కుడు ఎవ‌రో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here