ఆఫీస‌ర్ ను కాస్త ప‌ట్టించుకోండి సామీ..!

Nagarjuna Officerరామ్ గోపాల్ వ‌ర్మ‌-నాగార్జున కాంబినేష‌న్ అంటే ఒక‌ప్పుడు చాలా క్రేజ్ ఉండేది. వాళ్ళు చేసిన శివ అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మ‌రి. ఈ చిత్రం త‌ర్వాత వ‌ర‌స‌గా రెండు ఫ్లాపులు ఇచ్చినా కూడా మ‌ళ్లీ న‌మ్మి పాతికేళ్ళ త‌ర్వాత ఆయ‌న‌తో ఆఫీస‌ర్ చేసాడు నాగార్జున‌. అయితే ఇది చ‌రిత్ర‌లో నిలిచి పోయే డిజాస్ట‌ర్ గా మిగిలిపోయింది.
ఒక్క‌రోజు కూడా ఆడ‌కుండానే థియేట‌ర్స్ నుంచి గెటౌట్ అనేసారు ప్రేక్ష‌కులు. కోటి రూపాయ‌ల షేర్ కూడా తీసు కురాలేక చిన్న సినిమాల ముందు కూడా త‌ల వంచుకుంది ఆఫీస‌ర్. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని అమేజాన్ లో విడుద‌ల చేసారు. సాధారణంగా ఫ్లాప్ సినిమాల‌కు కూడా ఒక్కోసారి అమేజాన్ లో మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.
థియేట‌ర్స్ లో మిస్ అయిన సినిమాలను అమేజ‌న్ లో చూస్తుంటారు ప్రేక్ష‌కులు. కానీ ఆఫీస‌ర్ కు అక్క‌డ కూడా దారుణ‌మైన ప‌రాభ‌వం ఎదుర‌వుతుంది. ఈ చిత్రం అమేజాన్ లో విడుద‌లైన త‌ర్వాత కూడా క‌నీసం వాళ్లు పెట్టిన దానికి డ‌బ్బులు వ‌చ్చేలా లేవు. 5 కోట్ల‌కు పైగానే పెట్టి ఆఫీస‌ర్ ను కొన్నారు అమేజాన్ వాళ్లు. అయితే ఇప్పుడు ప‌రిస్థితి చూస్తుంటే దానికి భారీ మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌డం లేదు. మొత్తానికి అన్నిచోట్లా ఆఫీస‌ర్ అర‌చకాలే చేస్తున్నాడు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here