ఆర్ఎక్స్ 100.. బోల్డ్ తో గోల్డ్..!


ఒక‌ప్పుడు సినిమాలో ఒక్క ముద్దు ఉంటేనే బూతు సినిమా అనేవాళ్లు. కానీ ఇప్పుడు దానికి పేరు మార్చేసారు. కాలం మారింది క‌దా.. అందుకే స్టైల్ గా ట్రెండ్ మారి బోల్డ్ అంటున్నారు. ప‌చ్చిగా చూపిస్తుంటే తెగించారు అన‌కుండా బోల్డ్ కంటెంట్ తో ధైర్యం చేసార‌ని మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు కొత్త‌గా వ‌స్తున్న ద‌ర్శ‌కుల‌కు కూడా ఇదే అదునుగా దొరుకుతుంది. ఇప్పుడు ఆర్ఎక్స్ 100 అలా వ‌చ్చిన సినిమానే.
ఈ చిత్రం రెండు రోజుల్లోనే పెట్టిన పెట్టుబ‌డి వెన‌క్కి తీసుకొచ్చింది. అమ్మింది 2.70 కోట్ల‌కు అయితే.. రెండ్రోజుల్లోనే 2.50 కోట్లు వ‌చ్చేసాయి. మూడో రోజు నుంచి అన్నీ లాభాలే. ఆర్ఎక్స్ 100లో హాట్ సీన్స్ తో పాటు లిప్ లాక్స్ ఉండ‌టంతో సాధార‌ణంగా యూత్ ఈ చిత్రం వైపు అడుగేస్తున్నారు. మ‌రోవైపు ఇదే సినిమాకు పోటీగా వ‌చ్చిన విజేత సినిమాకు టాక్ బాగున్నా క‌లెక్ష‌న్లు లేక డిజాస్ట‌ర్ వైపు అడుగేస్తుంది.
ఆర్ఎక్స్ 100 జోరు చూస్తుంటే ఇక్క‌డితో సినిమా ఆగేలా క‌నిపించ‌ట్లేదు. టాప్ గేర్ లో ఉన్నాయి ప్ర‌స్తుతం దీని క‌లెక్ష‌న్స్. మ‌రో 4 కోట్ల వ‌ర‌కు వ‌చ్చేలా క‌నిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచే అవ‌కాశాలు ఆర్ఎక్స్ 100కు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్ పుత్ జంట‌గా న‌టించిన ఈ చిత్రాన్ని అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here