ఆర్ఎక్స్ 100.. 10 కోట్లు నాటౌట్..!

హీరో కూడా ఎవ‌రో తెలియ‌ని సినిమాకు నాలుగు రోజుల్లోనే 10 కోట్ల గ్రాస్ వ‌చ్చిందంటే ఆ సినిమా ప్ర‌భంజ‌నం ఎలా ఉందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు ఆర్ఎక్స్ 100 ఇదే చేస్తుంది. కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్ పుత్ జంట‌గా అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించిన ఈ చిన్న సినిమాకు బ్ర‌హ్మ‌రథం కాదు.. దానికి మించిన ర‌థం ప‌డుతున్నారు ప్రేక్ష‌కులు. ఈ చిత్రం వ‌సూళ్లు చూస్తుంటే క‌ళ్లు బైర్లు గ‌మ్మాల్సిందే.
ఒక్కోరోజు క‌నీసం కోటి రూపాయ‌ల షేర్ తీసుకొస్తూ దూసుకెళ్ళిపోతుంది ఆర్ఎక్స్ 100. అమ్మింది 2.70 కోట్ల‌కు అయితే.. నాలుగు రోజుల్లోనే 5.19 కోట్ల షేర్ వ‌చ్చింది. అంటే రెండ్రోజుల్లో త‌మ డ‌బ్బు వెన‌క్కి రావ‌డ‌మే కాదు.. అప్ప‌ట్నుంచీ లాభాల పంట పండుతూనే ఉంది. హాట్ సీన్స్ తో పాటు లిప్ లాక్స్ ఉండ‌టంతో సాధార‌ణంగానే యూత్ ఈ చిత్రం వైపు అడుగేస్తున్నారు. ఆర్ఎక్స్ 100 జోరు చూస్తుంటే ఇక్క‌డితో సినిమా ఆగేలా క‌నిపించ‌ట్లేదు. టాప్ గేర్ లో ఉన్నాయి ప్ర‌స్తుతం దీని క‌లెక్ష‌న్స్.
ఓవ‌ర్సీస్ లో మాత్రం ఆర్ఎక్స్ 100 ఫ్లాప్ అయింది. అక్క‌డ ఈ చిత్రాన్ని ప‌ట్టించుకోవ‌డం లేదు ప్రేక్ష‌కులు. అయితే తెలుగు రాష్ట్రాల‌లో మాత్రం మ‌రో 4 కోట్ల వ‌ర‌కు వ‌చ్చేలా క‌నిపిస్తున్నాయి. మొత్తంగా పెట్టుబ‌డికి నాలుగు రెట్లు లాభాలు తీసుకొచ్చి ఈ ఏడాదికి చిన్న సినిమాల్లో అతి పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలవ‌బోతుంది ఆర్ఎక్స్100.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here