ఎంసిఏ టార్గెట్ ఎంత‌..?

MCA TARGET

టాక్ ఎలా ఉన్నా.. నాని మాత్రం కుమ్మేస్తున్నాడు. పోటీ ఉన్నా కూడా తాను ముందుగా దూసుకెళ్తున్నాడు. ఈయన న‌టించిన ఎంసిఏ ఓపెనింగ్స్ దిమ్మ తిరిగిపోయే రేంజ్ లో ఉన్నాయి. టాక్ తో ప‌నిలేకుండా ఓపెనింగ్స్ కుమ్మేసేది ఒక్క మాస్ హీరోలే. ఇప్పుడు నాని కూడా ఈ లిస్ట్ లోకి చేరాడు. నాని సినిమాల‌కు ఇదివ‌ర‌కు రెండో రోజు అన్నిచోట్లా హౌజ్ ఫుల్ బోర్డులు క‌నిపించేవి కాదు. కానీ ఇప్పుడు ప‌డుతున్నాయి. అది కూడా యావ‌రేజ్ టాక్ తోనే. ఇప్పుడు ఎంసిఏ సృష్టిస్తున్న వ‌సూళ్ల సునామీ చూసి నాని కూడా షాక్ అయ్యుంటాడు త‌న‌కు ఇంత మార్కెట్ ఉందా అని..! తొలిరోజు ఏకంగా 15 కోట్ల గ్రాస్.. 9.55 కోట్ల షేర్ వ‌సూలు చేసింది ఎంసిఏ. చాలా ఏరియాల్లో రెండో రోజు కూడా మిడిల్ క్లాస్ అబ్బాయి కుమ్మేసాడు. హ‌లో తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో కేవ‌లం 3 కోట్ల‌తో స‌రిపెట్టుకుంటే.. ఎంసిఏ రెండో రోజు 3.3 కోట్ల షేర్ వ‌సూలు చేసింది.
తొలి రెండు రోజుల్లోనే 12 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది. 30 కోట్ల షేర్ వ‌స్తే హిట్ అనుకుంటే.. 40 శాతం వ‌సూళ్లు అప్పుడే తీసుకొచ్చాడు నాని. ఇంకా మూడు రోజులు సెల‌వులున్నాయి. ఈ లెక్క‌న మ‌రో 10 కోట్లైనా వ‌స్తాయ‌ని లెక్క‌లేస్తున్నారు ట్రేడ్ పండితులు. హ‌లో వ‌చ్చినా.. ఎంసిఏ టాక్ బ్యాడ్ గా ఉన్నా రెండోరోజు నిల‌బ‌డి 4 కోట్ల‌కు పైగానే షేర్ సాధించింది. ఈ లెక్క‌న సినిమాకు మాస్ ప్రేక్ష‌కుల ఓట్లు ప‌డుతున్నాయ‌న్న‌మాట‌. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ లో 5 ల‌క్ష‌ల డాల‌ర్ల వైపు ప‌రుగులు తీస్తుంది ఎంసిఏ. తొలి నాలుగు రోజుల్లో క‌చ్చితంగా 20 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసేలా క‌నిపిస్తుంది ఎంసిఏ. ఇదే జ‌రిగితే ఆ త‌ర్వాత వ‌చ్చే వ‌సూళ్లు కీల‌కం కానున్నాయి. మొత్తానికి ఎంసిఏ నానికి వ‌ర‌స‌గా ఎనిమిదో విజ‌యం అవుతుందో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here