గాయ‌త్రి జోరు మీదున్నాడుగా.. 

ఒక‌ప్ప‌ట్లా ఇప్పుడు మోహ‌న్ బాబు వ‌ర‌స సినిమాలు చేయ‌ట్లేదు. రెండేళ్ల‌కో మూడేళ్లకో ఓ సినిమా చేస్తున్నాడంతే వ‌య‌సు ప్ర‌భావ‌మో లేదంటే క‌థ న‌చ్చ‌ట్లేదో తెలియ‌దు కానీ మోహ‌న్ బాబు పూర్తిగా తెర‌కు దూరం అయ్యారు. చాలా కాలం త‌ర్వాత ఈయ‌న చేస్తోన్న సినిమా గాయ‌త్రి. మోహ‌న్ బాబు 42 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఆ మ‌ధ్య ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసారు. ఈ చిత్ర లోగోకు మంచి స్పంద‌న వ‌చ్చింది. పెళ్లైన కొత్త‌లో ఫేమ్ మ‌ద‌న్ ద‌ర్శ‌కుడు. ఒక‌ప్పుడు తాను చేసిన అసెంబ్లీ రౌడీ త‌ర‌హా స్క్రిప్ట్ ఇద‌ని చెబుతున్నాడు మోహ‌న్ బాబు. చాలా రోజుల త‌ర్వాత తన‌కు బాగా న‌చ్చిన క‌థ ఇది అంటున్నాడు ఈ సీనియ‌ర్ హీరో. ఈ చిత్రం త‌న‌కు ప‌ర్ ఫెక్ట్ సెకండ్ ఇన్నింగ్స్ అవుతుందంటున్నాడు క‌లెక్ష‌న్ కింగ్.
గాయ‌త్రిలో మోహ‌న్ బాబుతో పాటు ఆయ‌న త‌న‌యుడు విష్ణు కూడా కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. మ‌రో విశేషం ఏంటంటే యాంక‌ర్ అన‌సూయ ఇందులో కీల‌క‌పాత్ర‌లో క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. ఈ చిత్రంలోని ఓ పాట కోసం తిరుప‌తిలో భారీ సెట్టింగుల మ‌ధ్య పూర్తి చేసారు. అక్క‌డే ప్ర‌త్యేకంగా గ‌ణేష్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌డంతో పాటు 1000 మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు.. 400 మంది డాన్స‌ర్లు క‌నిపించారు. బాలీవుడ్ స్టార్ కొరియోగ్ర‌ఫ‌ర్ గ‌ణేష్ ఆచార్య ఈ పాట‌కు స్టెప్స్ కంపోజ్ చేసాడు. ఇదంతా చూస్తుంటే గాయ‌త్రి అల్లాట‌ప్పాగా ఉన్న‌ట్లు క‌నిపించ‌ట్లేదు. ఈ సినిమా త‌న‌కు సెకండ్ ఇన్నింగ్స్ గా మారుతుంద‌ని ఆశిస్తున్నాడు మోహ‌న్ బాబు. అనుకున్న‌ట్లుగా భారీగా గాయ‌త్రి సినిమాను సిద్ధం చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here