చైతూ ప్లానింగ్ కేకో కేక‌స్య కేక‌భ్యః

NAGA CHAITHNYA
అవును.. ఇప్పుడు ఈయ‌న ప్లానింగ్ చూస్తుంటే ముచ్చ‌టేస్తుంది. లేక‌పోతే మ‌రేంటి.. ముందు మొద‌లుపెట్టిన సినిమాను త‌ర్వాత‌కి మార్చి.. త‌ర్వాత మొద‌లుపెట్టిన సినిమాను ముందు విడుద‌ల చేస్తున్నాడు నాగ‌చైత‌న్య‌. అర్థం కాలేదు క‌దా.. అంతా అనుకున్న‌ట్లుగానే శైల‌జారెడ్డి అల్లుడు కోసం స‌వ్య సాచి త్యాగం త‌ప్ప‌లేదు. ఈ రెండింట్లో అల్లుడిపైనే అంచ‌నాలు భారీగా ఉన్నాయి. మ‌రోవైపు ఈ రెండు సినిమాల‌తో త‌న మార్కెట్ పెంచుకోవాల‌ని క‌ల‌లు కంటున్నాడు చైతూ. ఈయ‌న ఇండ‌స్ట్రీకి వ‌చ్చి అప్పుడే తొమ్మిదేళ్లైపోయింది.
ఇప్ప‌టి వ‌ర‌కు 15 సినిమాలు పూర్తి చేసాడు.. హిట్లు కొట్టాడు.. సూప‌ర్ హిట్లు కూడా ఇచ్చాడు. కానీ మార్కెట్ లో మాత్రం ఇంకా వెన‌క‌బ‌డే ఉన్నాడు. ఆ హీరోనే నాగ‌చైత‌న్య‌. వార‌స‌త్వం ఉండి.. బోలెడంత బ్యాగ్రౌండ్ ఉండి కూడా ఇప్ప‌టికీ రేస్ లో వెన‌కే ఉన్నాడు ఈ హీరో. నాని లాంటి హీరోలు కూడా నాగ‌చైత‌న్య‌తోనే ఇన్నింగ్స్ మొద‌లుపెట్టి ఇప్పుడు 40 కోట్ల రేంజ్ లో ఉంటే చైతూ మాత్రం ఇప్ప‌టికీ 30 కోట్ల మార్క్ కూడా అందుకోలేక‌పోయాడు.
దాంతో ఇప్పుడు త‌న మార్కెట్ పెంచుకోవ‌డం కోసం ట్రై చేస్తున్నాడు ఈ హీరో. ప్ర‌స్తుతం ఈయ‌న క‌మిటైన సినిమాలు ఇలాగే ఉన్నాయి. స‌వ్య‌సాచిపై భారీ అంచ‌నాలున్నాయి. చందూమొండేటి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం క‌చ్చితంగా 30 కోట్ల క‌ల‌ను తీరుస్తుంద‌ని న‌మ్ముతున్నాడు ఈ హీరో. ఇక దాంతోపాటు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో శైల‌జారెడ్డి అల్లుడుపై కూడా అంచ‌నాలు బాగానే ఉన్నాయి. స‌వ్య‌సాచి కంటే ముందే అల్లుడు వ‌స్తున్నాడు.
ఆగ‌స్ట్ 31న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ సినిమా బిజినెస్ కూడా 25 కోట్ల‌కు పైగానే జ‌రుగుతుంది. ఈ రెండు సినిమాల‌తో పాటు శివ‌నిర్వాణ సినిమా కూడా ఉంది. ఇందులో స‌మంత‌తో న‌టించ‌నున్నాడు నాగ‌చైత‌న్య‌. ఈ మూడు సినిమాల‌తో క‌చ్చితంగా త‌న మార్కెట్ పెరిగిపోతుంద‌ని భావిస్తున్నాడు చైతూ. మ‌రి చూడాలిక‌.. అక్కినేని వార‌సుడి ఆశ‌ల‌ను ఈ సినిమాలు ఎంత‌వర‌కు తీరుస్తాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here