చ‌ర‌ణ్, ఎన్టీఆర్ కు రాజ‌మౌళి షాక్..


ఇప్పుడు రాజ‌మౌళి ఏం చేసినా చిన్న సైజ్ షాక్ లాగే ఉంటుంది. ఎందుకంటే ఆయ‌న చేస్తోన్న సినిమాలు అలా ఉన్నాయి మ‌రి. క‌ల‌లో కూడా ఊహించ‌ని విధంగా తెలుగు సినిమా రేంజ్ ను తీసుకెళ్లి ఇండియ‌న్ జెండాపై కూర్చోబెట్టాడు ద‌ర్శ‌క‌ధీరుడు. ఇక ఇప్పుడు చ‌ర‌ణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో మ‌ల్టీస్టార‌ర్ అనౌన్స్ చేసి మ‌రో సంచ‌ల‌నం సృష్టించాడు. ఈ సినిమా కోసం ఏకంగా 300 కోట్లు పెట్టిస్తున్నాడు. ఈ మాట చెప్పింది ఎవ‌రోకాదు..
స్వ‌యంగా ఆ చిత్ర నిర్మాత డివివి దాన‌య్య‌. ఈ మ‌ల్టీస్టార‌ర్ కోసం భారీ బ‌డ్జెట్ పెడుతున్నాం.. అది 300 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని చెప్పాడు దాన‌య్య‌. ఎన్టీఆర్, చ‌ర‌ణ్ హీరోలుగా జ‌క్క‌న్న తెర‌కెక్కించ‌బోయే ఈ చిత్రం అక్టోబ‌ర్ నుంచి మొద‌లు కానుంది. అక్క‌డ మ‌రో ద‌ర్శ‌కుడైతే నిర్మాత ఆలోచ‌న‌లో ప‌డేవాడేమో కానీ అడుగుతున్న‌ది రాజ‌మౌళి. 300 కోట్లు పెడితే 500 వ‌స్తాయ‌ని అత‌డి న‌మ్మ‌కం. అందుకే మ‌రో మాట లేకుండా డివివి దాన‌య్య కూడా బ‌డ్జెట్ ఇచ్చేస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని కూడా విజువ‌ల్ వండ‌ర్ గానే రాజ‌మౌళి తెర‌కెక్కించ‌బోతున్నాడు.
బాహుబ‌లి రేంజ్ లో కాదు కానీ ఈగ స్థాయిలో ఈ చిత్రంలో గ్రాఫిక్స్ వాడుకుంటున్నాడు రాజ‌మౌళి. ఇందులో ఎన్టీఆర్ కారెక్ట‌ర్ కాస్త నెగిటివ్ టచ్ లో సాగుతుంద‌ని తెలుస్తుంది. అయితే ఈ చిత్రం ముందు నుంచి చెబుతున్న‌ట్లు అక్టోబ‌ర్ లో ప‌ట్టాలెక్క‌డం లేదు. కాస్త ఆల‌స్యంగా అంటే జ‌న‌వ‌రిలో సెట్స్ పైకి వ‌చ్చే ఛాన్స్ ఉంది. అప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్, చ‌ర‌ణ్ కూడా త‌మ సినిమాల షూటింగ్స్ పూర్తి చేసుకోనున్నారు. దాంతో 2020 సంక్రాంతికి ఈ చిత్రం రావ‌డం క‌ష్ట‌మే. కాస్త ఆల‌స్యంగా స‌మ్మ‌ర్ లో వ‌చ్చే అవ‌కాశం ఉంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here