ఛ‌లో డార్జిలింగ్ అంటున్న రాజ‌మౌళి..

RAJAMOULI DARJELLING MAJOR SCHEDULE
రాజ‌మౌళి ఏం చేసినా సంచ‌ల‌న‌మే. ఇప్పుడు ఈయ‌న సినిమా కోసం లొకేష‌న్లు వెతుక్కుంటున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న టీం కూడా ప‌ర్మిష‌న్స్ కోసం సీరియ‌స్ గా తిరుగుతున్నారు. డార్జిలింగ్ లో రాజ‌మౌళి త‌ర్వాతి సినిమా మేజ‌ర్ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త‌మ సినిమాల‌తో బిజీగా ఉన్నా.. వ‌చ్చిన త‌ర్వాత మాత్రం ఆల‌స్యం చేయ‌కూడ‌ద‌ని ఫిక్స్ అయిపోయాడు ద‌ర్శ‌క‌ధీరుడు. అందుకే అన్నీ ముందే సిద్ధం చేస్తున్నాడు.
ఇప్ప‌టికే హైద‌రాబాద్ ప‌రిసర ప్రాంతాల్లోని కొల్లూరు అనే ఊళ్లో కూడా భారీ సెట్లు వేయిస్తున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు క‌థేంటో చెప్ప కుండానే మ‌ల్టీస్టార‌ర్ కు అంతా సిద్ధం చేసుకుంటున్నాడు రాజ‌మౌళి. ఇప్ప‌టికీ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ కు నిజంగా క‌థేంటో తెలియ‌దు. ఇప్పుడు ఆ స‌మ‌యం వ‌చ్చిన‌ట్లుంది.
త్వ‌ర‌లోనే ఇద్ద‌రు హీరోల‌కు పూర్తిక‌థ చెప్ప‌బోతున్నాడు జ‌క్క‌న్న‌. దానికోసం చ‌ర‌ణ్.. ఎన్టీఆర్ ల‌కు ఫ్రీ టైమ్ ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు బోయ‌పాటి సినిమాతో చ‌ర‌ణ్.. త్రివిక్ర‌మ్ సినిమాతో ఎన్టీఆర్ ఇప్పుడు బిజీగా ఉన్నారు. ఇందులో ఎన్టీఆర్ సినిమా అక్టోబ‌ర్ లోపు పూర్తి కానుంది. ఇక చ‌ర‌ణ్ కూడా డిసెంబ‌ర్ లోపు త‌న ప‌ని పూర్తి చేసుకోవాల‌నుకుంటున్నాడు.
ఇక ఈ మ‌ల్టీస్టార‌ర్ ను కూడా ముందు అక్టోబ‌ర్ నుంచి ప్లాన్ చేసినా.. ఇప్పుడు వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రికి వాయిదా వేసాడు రాజ‌మౌళి. ఆలోపు ఇక్క‌డ కొల్లూరులో సెట్లు.. అక్క‌డ డార్జిలింగ్ లో లొకేష‌న్లు ఫైన‌లైజ్ చేసుకుని ప్రీ ప్రొడ‌క్ష‌న్ తో ప‌క్కాగా ఉండ‌బోతున్నాడు జ‌క్క‌న్న‌. 2020 ఎప్రిల్ లో సినిమా విడుద‌ల కానుంది. 300 కోట్ల‌తో దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here