జూన్ 29.. ఎనిమిది సినిమాలు విడుద‌ల‌..!

ఒకేరోజు ఎనిమిది సినిమాలు.. అదే జూన్ 29. ఇప్పుడు ఈ తేదీ కోసం చిన్న నిర్మాత‌లు క‌ళ్ళ‌లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. ఆ రోజు ఏకంగా ఎనిమిది సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. ఎన్ని సినిమాలు వ‌స్తున్నా కూడా అంద‌రి క‌ళ్ళు ఈ న‌గ‌రానికి ఏమైందిపైనే ఉన్నాయి. పెళ్లిచూపులు లాంటి సంచ‌ల‌నం త‌ర్వాత త‌రుణ్ భాస్క‌ర్ నుంచి వ‌స్తోన్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపైనే ఆస‌క్తి ఉంది.

ఇవి కాకుండా మ‌రో ఏడు సినిమాలు వ‌స్తున్నాయి. ఇందులో చాలా మందికి తెలియ‌ని యాక్ట‌ర్స్ ఉన్నారు. సంజీవని.. క‌న్నుల్లో నీ రూప‌మే.. అల్లుశిరీష్ మ‌ళ‌యాల డ‌బ్బింగ్ సినిమా యుద్ధ‌భూమి.. సూప‌ర్ స్కెచ్.. ఐపిసి సెక్ష‌న్ భార్యాబంధు.. లాంటి సినిమాలు చాలానే వ‌స్తున్నాయి. ఇక హిందీలో సంజూ కూడా అదే రోజు రానుంది.

ఈ చిత్రం తెలుగులోనూ స‌త్తా చూపించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఎందుకంటే రాజ్ కుమార్ హిరాణి ద‌ర్శ‌కుడు కావ‌డం ఒక కార‌ణ‌మైతే.. సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్ కావ‌డం మ‌రో రీజ‌న్. క‌చ్చితంగా మ‌న సినిమాల‌ను సైతం డామినేట్ చేసేలాగే సంజూ ఓపెనింగ్స్ రావ‌డం ఖాయం. మ‌రి చూడాలిక‌.. చివ‌రికి ఏం జ‌రుగుతుందో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here