డిసెంబ‌ర్ 16న వ‌రంగ‌ల్‌లో `ఎంసీఏ` భారీ ప్రీ రిలీజ్ వేడుక‌

MCA Pre-Release Event
నేచుర‌ల్ స్టార్ నాని, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న చిత్రం `ఎంసీఏ`. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టే్శ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్, ల‌క్ష్మ‌ణ నిర్మాత‌లుగా సినిమా నిర్మిత‌మ‌వుతుంది. ఈ సినిమా డిసెంబ‌ర్ 21న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబ‌ర్ 16న వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా…
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “డ‌బుల్ హ్యాట్రిక్ హీరో నాని ఈ ఏడాది ప్రారంబంలో మా శ్రీ వెంకటేశ్వర క్రియేష‌న్స్‌ బ్యాన‌ర్‌లో `నేను లోక‌ల్‌` సినిమాతో హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ ఏడాది చివ‌ర‌ల్లో `ఎంసీఏ` సినిమాతో మ‌రో హిట్‌ను సాధించ‌బోతున్నాడు. ఈ సినిమా స‌క్సెస్‌తో మా బ్యాన‌ర్ ఒకే ఏడాది డబుల్ హ్యాట్రిక్  సాధిస్తుంద‌ని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. రేపు (డిసెంబర్ 12న) ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయనున్నాం. ఈ సినిమా కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. వ‌దిన‌, మ‌రిదిల మ‌ధ్య అనుబంధాన్ని తెలియ‌జేసే చిత్రంగా మా ఎంసీఏ ప్రేక్ష‌కుల ముందుకు డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. సినిమా ప్రారంభం నుండి నాని, సాయిప‌ల్ల‌వి జంట ఈ సినిమాలో న‌టిస్తున్నార‌నగానే సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్పడ్డాయి. సినిమా చాలా బాగా వచ్చింది. శ్రీరామ్ వేణు సినిమా ను చ‌క్క‌గా డైరెక్ట్ చేశాడు. దేవి శ్రీ ప్రసాద్ అద్భుత‌మైన సాంగ్స్‌ను అందించాడు. ఈ పాట‌లు అల్రెడి మార్కెట్లోకి విడుద‌ల‌య్య‌యాయి. సాంగ్స్‌కి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే . ఈ డిసెంబ‌ర్ 16న వ‌రంగ‌ల్‌లో ప్రీ రిలీజ్ వేడుకను అభిమానుల స‌మ‌క్షంలో గ్రాండ్‌గా నిర్వ‌హించ‌బోతున్నాం“ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here