తేజ నెక్ట్స్ ఏం చేస్తాడు మ‌రి…?


సినిమాను మించిన ట్విస్టులు ఇప్పుడు తేజ కెరీర్ లో క‌నిపిస్తున్నాయి. 15 ఏళ్ల త‌ర్వాత హిట్ వ‌చ్చింది.. పోనీలే అనుకుంటే ఇప్పుడు మ‌ళ‌లీ త‌న పొగ‌రుతో అన్నీ దూరం చేసుకుంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఎక్క‌డా త‌గ్గ‌క‌పోవ‌డంతో వ‌చ్చిన అవ‌కాశాలు కూడా వెన‌క్కి వెళ్లిపోతున్నాయి.
ఇప్పుడు ఈయ‌న మ‌ళ్లీ ఖాళీ అయిపోయాడు. మొన్న‌టి వ‌ర‌కు చేతిలో రెండు భారీ సినిమాలు ఉండేవి కానీ ఇప్పుడు ఏం లేవు. బాల‌య్యతో చేయాల్సిన ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆగిపోయింది. దానికి కార‌ణం ఆయ‌న‌కు బాల‌య్య‌తో వ‌చ్చిన క్రియేటివ్ డిఫెరెన్సెస్ అని తెలుస్తుంది. ఇక వెంక‌టేశ్ సినిమా కూడా ఎందుకు ఆగిపోయిందో క్లారిటీ లేదు. ఈ రెండు సినిమాలు ఆగిపోవ‌డంతో ఇప్పుడు నెక్ట్స్ ఏం చేయాలా అనే క‌న్ఫ్యూజ‌న్ మొద‌లైంది.
ప్ర‌స్తుతం ఈ ద‌ర్శ‌ఖుడు రానా కోసం చూస్తున్నాడు కానీ ఆయ‌న మ‌రో రెండేళ్ల వ‌ర‌కు బిజీ. ఇక ఇప్పుడు వ‌రుణ్ తేజ్ కు క‌థ చెబుతున్నాడ‌ని వార్త‌లు వినిప‌సి్తున్నాయి. అయితే దీనిపై కూడా క్లారిటీ లేదు. ఇక ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ కూడా లేద‌ని తేలిపోయింది. దాంతో ఇప్పుడు తేజ ఏం చేస్తున్నాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. చూడాలిక‌.. తేజ నెక్ట్స్ ఏం చేయ‌బోతున్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here