ధడక్ ఆ పోస్టర్ విడుదలైంది..

DHADAK-MOVIE-COLLECTIONS
తొలి సినిమాతోనే విజయం అందుకోవడం అనేది ఓ కల. అది అందరి విషయంలో జరగదు. కానీ శ్రీధేవి కూతురు మాత్రం తొలి సినిమాతోనే ఆ విచిత్రం చేసింది. ఈమె తొలి సినిమాకు ఇప్పుడు మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం 70 కోట్ల వరకు వసూలు చేసింది. ఇండియాలో అయితే మరింత దూకుడు చూపిస్తుంది ఈ చిత్రం. రెండో వారంలో కూడా పెద్దగా సినిమాలేవీ రాకపోవడంతో ధడక్ దూకుడు కొనసాగింది.
తొలి రోజు కాస్త భిన్న‌మైన టాక్ వినిపించినా.. ఒక్కో రోజు గడుస్తుంటే అది పూర్తిగా తొల‌గిపోయింది. ఈ సినిమాతో ఝాన్వీకి మంచి పేరుతో పాటు ఇమేజ్ కూడా వచ్చింది. తొలి సినిమాలో గ్లామ‌ర్ కాకుండా ప‌ర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ చేయ‌డంతో ఆ ఇమేజ్ అలాగే క్యారీ అవుతుంది. సైరాత్ చూసిన వాళ్ల‌కు ధ‌డ‌క్ పెద్ద‌గా రుచించ‌క‌పోయినా.. చూడ‌ని వాళ్లు మాత్రం పండ‌గ చేసుకుంటున్నారు. కేవ‌లం ఝాన్వీ కోస‌మే ఈ చిత్రాన్ని చూస్తున్న వాళ్లు కూడా లేక‌పోలేదు.
తొలి వారం రోజుల్లో ఇండియాలో 55 కోట్లు.. ఓవ‌ర్సీస్ లో 12 కోట్లు వ‌సూలు చేసి.. మొత్తంగా 66 కోట్ల ద‌గ్గ‌ర నిలిచింది ఈ చిత్రం. బాలీవుడ్ లో ఏ వార‌సురాలికైనా ఇదే హైయ్య‌స్ట్ ఓపెనింగ్స్. ధ‌డ‌క్ జోరు చూస్తుంటే క‌నీసం 80 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. క‌ర‌ణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మొత్తానికి త‌న కూతురు హీరోయిన్ గా నిల‌బ‌డితే చూడాల‌నుకున్న శ్రీ‌దేవి క‌ల తీరిపోయింది. ఇప్పుడు ఆమె ఆత్మ ఎక్క‌డున్నా కూడా శాంతించే ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here